అశోక్ సుఖుమల్ ఆస్వానీ…. ఆయుర్వేద వైద్యుడు. గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లా ఆదిపూర్ లో హస్తవాసితో పాటు హాస్యవాని గల వైద్యునిగానే కాక, చార్లీ చాప్లిన్ అభిమానిగా ఎనలేని గుర్తింపు పొందారు.

అశోక్ కు చార్లీ చాప్లిన్ అంటే మహా ఇష్టం. అందుకే ఆయన సినిమాలను సేకరించడం, వాటిని చూడటం వ్యాపకంగా మార్చుకున్నారు. ఆదిపూర్ పట్టణం నడిబొడ్డున ఉన్న ఆయన క్లినిక్ నిండా చార్లీ చాప్లిన్ బొమ్మలు, పోస్టర్లు, సినిమాల డీవీడీలు ఉంటాయి. తన దగ్గరకు వచ్చే రోగులను నవ్వుతూ పలకరిస్తూ… నవ్వు గొప్పదనాన్ని వివరిస్తుంటారు. అంతేనా మందుల చీటీతో పాటు ఒకటి రెండు చార్లీ చాప్లిన్ నటించిన చిత్రాల డీవీడీలను ఇచ్చి చూడమని సూచిస్తుంటారు. వీటిని చూసి హాయిగా నవ్వుకుంటే ఎలాంటి అనారోగ్యమైనా ఇట్టే హుష్ కాకి అవుతుందని చెబుతుంటారు. * 1978లో ‘

చార్లీ సర్కిల్ అనే సంస్థను స్థాపించారు. ఇందులో 400 మంది దాకా సభ్యులు ఉన్నారు. ఏటా ఏప్రిల్ 16న చార్లీ చాప్లిన్ జయంతి వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ‘సర్కిల్ సభ్యులు ఆ రోజున

చార్లీ చాప్లిన్ వేషధారణల్లో మెరిసిపోతారు. అందరూ కలిసి పరేడ్ చేస్తారు. * నాలుగేళ్ల కిందట నుంచి అశోక్ ‘చార్లీ చాప్లిన్ ఫౌండేషన్ ను స్థాపించి, పలు సేవా కార్యక్రమాలనూ నిర్వహిస్తున్నారు. ‘చార్లీ భవన్ ను ఏర్పాటు చేసి చాప్లిన్ కు సంబంధించిన పలు విశేషాలకు చోటు కల్పించారు.

Courtesy Eenadu…