బాబు తెలంగాణ-ఆంధ్ర రెండు కళ్ల సిద్ధాంతం లో ఇప్పుడు రెండో కన్ను అవుట్

AP CM, TDP Chief Chandra Babu Naidu lost his Two Eyes in this General Elections. He lost both Telangana and Andhra Elections of 2019.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తెలంగాణ, ఆంధ్ర రెండు కళ్ల సిద్ధాంతం లో గతంలోనే ఒక కన్ను ఔట్, రెండో కన్ను డౌట్ అని చెప్పాను. చెప్పినట్లుగానే, ఇప్పుడు రెండో కన్ను అవుట్ అయిపోయింది.ఆవిధంగా ఒక రాజకీయ అధికార మదాంధుడు రెండు కళ్ళు పోగొట్టుకున్న అందుడుగా మారిపోయాడు.

నూతన రాష్ట్ర రాజధాని నిర్మాణ స్థలం ఎంపిక మొదలు, మొత్తం స్వకుల ఆధిపత్య మాయం చేశాడు, రాజధానిని కుల అగ్రహారం గా మార్చే ప్రయత్నంలో మునిగిపోయాడు.  అలాంటి కులోన్మాది కుల దురహంకారి పచ్చి నియంత చంద్రబాబును ప్రజలు కేవలం ఓడించారు అనడం సరిపోదు కసిదీరా శిక్షించారు, తమ కోపాగిన్లో దహించి వేసారు.

అధికార దర్పంతో ఎవరిని బడితే వారిని నోటికి వచ్చినట్లు ఎంతమాటొస్తే అంతమాట విసురుతూ, ప్రజల్ని ‘” ఏయ్ నోర్ముయ్, తోకలు కత్తిరిస్తా, తాత తీస్తా, తోలు వలుస్తా వంటి అవమానకరమైన పదజాలాన్ని వాడినా, సహించి భరించిన ప్రజలు క్రోధాగ్ని మహామంటలుచంద్రబాబు కుల అహంకారాన్ని దహించి వేసాయి. మహాగ్రహంతో ఈవీఎం మీటలు నొక్కిన వేళ్ళతోనే నెత్తికెక్కిన ఆ రెండు కనుగుడ్లను పెకిలించి వేశారు. చంద్రబాబు పాపాలు పండాయి శిశుపాలుడు తొంబై తొమ్మిది కాదు నూరు తప్పులూ చేసాడు.
క్షమించడం సాధ్యం కాదు ప్రజలే ఓటు సుదర్శన చక్రంతో అధికార నిరంకుశ పరిపాలకుడి శిరస్సుని ఖండిచారు ప్రజలే బాహుబలులు.

చెప్పింది చేయకపోవడం, చేసేది చెప్పకపోవడం, వాగ్దానాలు అమలు జరపకపోవడం, కొన్ని అమలుజరిపినట్లు కనపడినా అందులో చిత్తశుద్ది లేకపోవడమే నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకత.
కనుక అంతే ప్రత్యేకంగా ప్రజలు కుడా చంద్రబాబు నాయుడిని ‘శపించారు’

కొత్త పాలకులు కుడా ఈ పరమ సత్యాన్ని క్షణకాలంపాటు కుడా మరచిపోరాదు. చేసిన వాగ్దానాలను, బహుజనులకు సామాజిక న్యాయాన్ని విస్మరించరాదు, విస్మరిస్తే ప్రజలు మల్లి గుర్తు చేస్తారు. ఎందుకంటే ప్రజలు ఎల్లప్పుడూ బాహుబలులే.

రాజకీయ చరిత్రలో చంద్రబాబు ఒక నెగటివ్ ఎగ్జాంపుల్ (అనుసరించగూడని ఉదాహరణ) రాజకీయనాయకులార, తస్మాత్ జాగ్రత్త!

  • YK
    కన్వీనర్, సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్
    సెల్ – 9849856568