* ఐదేళ్లలో కుదిరిన ఒప్పందాల విలువ 1.70 లక్షల కోట్లే
* ప్రారంభమైనవి రూ.30 వేల కోట్ల పరిశ్రమలే
* చర్చనీయాంశమైన అధికారుల తాజా నివేదిక

అమరావతి: ఐదేళ్లకాలంలో రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకోసం లక్షలకోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు జరిగినట్లు అధికారులు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దావోస్‌లో నాలుగేళ్లపాటు నిరంతరాయంగా జరిగిన సమావేశాల్లోనూ, విశాఖపట్నంలో మూడేళ్ల పాటు జరిగిన సదస్సుల్లోనూ కలిపి దాదాపు రూ.16 లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయని అధికారులు పదేపదే ప్రకటించారు. అయితే, తాజాగా రూపొందించిన నివేదికలో ఐదు సంవత్సరాల కాలంలో కేవలం రూ.1.70 లక్షల కోట్ల మేర ఒప్పందాలు జరిగాయని మాత్రమే పేర్కొనడం విశేషం. త్వరలో జరగనున్న బడ్జెట్‌ సమావేశాల కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి అందజేయడానికి రూపొందించిన ఈ నివేదిక ప్రస్తుతం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నివేదికలో పేర్కొన్న గణాంకాల ప్రకారం ఐదేళ్ల కాలంలో రూ.1.70 లక్షల కోట్ల ఒప్పందాలు మాత్రమే జరగ్గా, అందులో రూ.30 వేల కోట్ల విలువైన పరిశ్రమలు మాత్రమే ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా 59,700 మందికి వివిధ స్థాయిలో ఉపాధి లభిరచిరది. ఇక మరో మూడు వేల కోట్ల రూపాయల విలువైన పరిశ్రమలు నిర్మాణాలు పూర్తి చేసుకుని, ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. మరో ఆరు వేల కోట్ల రూపాయల విలువైన పరిశ్రమలు యంత్రాల స్థాపన స్థాయికి చేరుకున్నాయని పేర్కొన్నారు. అంటే, దాదాపుగా రూ.39 వేల కోట్ల ఒప్పందాలు మాత్రమే ఏదో రూపంలో ఫలితాలనిస్తున్నాయి. మిగిలిన వాటి భవిష్యత్‌ ఏమిటో తెలియని పరిస్తితి నెలకొంది. ఇదంతా అధికారయంత్రాంగం ప్రస్తుతానికి చెబుతున్న 1.70 లక్షల కోట్ల రూపాయల మేర ఒప్పందాలకు సంబంధించినదే! మరి గత ప్రభుత్వ హయాంలో పదేపదే చెప్పిన రూ.16 లక్షల కోట్ల ఒప్పందాలు.. వాటి అమలు తీరు అగమ్యగోచరమే!

భూమి ఎక్కడ..
పరిశ్రమలు వస్తే అన్నీ తామే చూసుకురటామని చెబుతున్న గత, ప్రస్తుత ప్రభుత్వాలు భూమి ఇచ్చేందుకు కూడా తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. రూ.1.70 లక్షల కోట్ల ఒప్పందాల్లో రూ.73,599 కోట్ల ఒప్పందాలకు భూమి ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు. ఇలా భూమి కోసం ఏడు పరిశ్రమలు ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోరది. ఇక మరో ఊ.48 వేల కోట్ల విలువైన పరిశ్రమలు అనుమతుల కోసం ఎదురుచూపులు, ప్రతిపాదనలు తయారీ స్థాయిలో ఉన్నట్లు తేలిరది.

అన్నీ కాకి లెక్కలే
రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలు, వచ్చినవి, ఉపాధి వంటి అరశాలపై చెబుతున్న గణారకాలు అన్నీ కాకి లెక్కలుగానే భావిస్తున్నారు. పెట్టుబడులపై గత ప్రభుత్వం చెప్పినవి, వాటిపై ప్రభుత్వ వెబ్‌సైట్‌లో చూపిస్తున్నవి, తాజాగా ముఖ్యమంత్రి సమీక్ష కోసం అధికారులు తయారుచేసిన గణారకాలు పరిశీలిస్తే ఏమాత్రం పొరతన కనిపిరచడం లేకపోవడం విశేషం. పెట్టుబడుల శాఖ తయారు చేసిన ఆన్‌లైన్‌ గణారకాల మేరకు ఒక్క పెట్టుబడుల సదస్సు ద్వారా రూ.12.31 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయి. 2016లో జరిగిన సదస్సులో రూ.3 లక్షల కోట్లు, 2017లో రూ.7 లక్షల కోట్లు, 2018లో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని ఆన్‌లైన్‌లో పేర్కొన్నారు. ఇక దావోస్‌, ఇతర విధానాల ద్వారా మరో రూ.4 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినట్లు ప్రకటిరచారు. అలాగే ఈ మూడు సంవత్సరాల్లో వచ్చిన పెట్టుబడుల్లో రూ.1.4 లక్షల కోట్ల విలువైనవి ఉత్పత్తి ప్రారంభిరచినట్లు పేర్కొన్నారు. దీనికి భిన్నంగా ముఖ్యమంత్రి జగన్‌ కోసం అధికారులు తయారుచేసిన నివేదికలోని అంకెలున్నాయి.

Courtesy Prajashakti