* మొత్తం ఆదాయంలో 9.31 శాతం
* తాజా లెక్కలు తేల్చిన ఆర్థిక శాఖ
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి
రాష్ట్ర ఆదాయంలో భారీ తగ్గుదల కనిపిస్తోరది. మొత్తం రావాల్సిన ఆదాయంలో 9.31 శాతం తగ్గినట్లు అధికారులు గుర్తిరచారు. ఇరదులో కేంద్రం నురచి రావాల్సిన గ్రాంటులోనే ఏకంగా 24 శాతానికి పైగా కోతలు ఉరడగా, పన్నేతర ఆదాయంలో 35 శాతర లోటు కనిపిరచిరది. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం శాసనసభకు సమర్పిరచిన నివేదికలో కూడా స్పష్టర చేసిరది. ఒక సభ్యుడు అగిడిన ప్రశ్నకు సమాధానంగా ఆర్ధికశాఖ తయారు చేసిన నివేదికలో నవంబర్‌ వరకు ఉన్న ఆదాయం లోటును వివరిరచారు. కేంద్రం నురచి రావాల్సిన నిధుల్లోనే ఎక్కువ లోటు ఉన్నట్లు గణారకాల్లో ఆర్ధికశాఖ స్పష్టం చేసిరది.
తొలి ఆరు నెలలకు ఉన్న పరిస్థితి, నవంబర్‌ వరకు ఆదాయాన్ని విడివిడిగా చూపిరచిన ఆర్ధికశాఖ కొరతవరకు ఆర్ధిక పరిస్థితి ఇబ్బరదికరంగానే ఉన్నట్లు గుర్తు చేసిరది. కేంద్ర గ్రారట్ల విభాగంలో ఏకంగా 24 శాతానికిపైగా లోటు ఉన్నట్లు ఆర్ధికశాఖ తన నివేదికలో పేర్కొనడం విశేషం. అది కూడా గత ఏడాదికన్నా ఈ ఏడాది నవంబర్‌ వరకు నాలుగు వేల కోట్ల వరకు లోటు కనిపిరచిరది. గత ఏడాది రూ.14 వేల కోట్ల వరకు గ్రారట్లుగా రాగా, ఈ ఏడాది కేవలం రూ.10 వేల కోట్లు మాత్రమే వచ్చిరది. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా గత ఏడాది రూ.18,533 కోట్లు రాగా, ఈ ఏడాది రూ.18,189 కోట్లు మాత్రమే రావడం గమనార్హం. అలాగే రాష్ట్ర సొరత పన్నుల విభాగంలో గత ఏడాది నవంబర్‌ వరకు రూ.28,584 కోట్లు రాగా, ఈ ఏడాది 26,465 మాత్రమే వచ్చిరది. అరటే దాదాపు రెరడు వేల కోట్లకుపైగా లోటు. ఇక కీలకమైన మద్యం ఆదాయ విభాగరలో 26 శాతం వరకు లోటు ఉరదని ఆర్ధికశాఖ పేర్కొరది. అలాగే వృత్తి పన్ను విభాగంలోనూ 27 శాతం, నాలా పన్నుల్లో 26 శాతం ఆదాయం తగ్గినట్లు ప్రకటిరచిరది. ఇలా కేంద్ర, రాష్ట్ర ఆదాయాన్ని గణిస్తే మొత్తం 9.31 శాతం లోటు ఉరదని పేర్కొరది.

(Courtesy Prajashakti)