• కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన
  • న్యూఢిల్లీ, నవంబరు 4: దేశంలో 9 గంటల పని దినాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. అదే సమయంలో జాతీయ కనీస వేతనాన్ని తనకు తానుగా ఖరారు చేయడానికి మాత్రం సుముఖంగా లేదు. కేంద్రం తాజాగా వేతన స్మృతి ముసాయిదా నిబంధనలను రూపొందించింది.

వాటిని ప్రజల్లో చర్చకు విడుదల చేసింది. వేతనాన్ని నిర్ధారించేందుకు నెలకు 26 రోజులు, ఎనిమిది గంటల చొప్పున లెక్కిస్తారు. ఇప్పటికే చాలా ఫ్యాక్టరీల్లో 9 గంటల షిఫ్ట్‌ నడుపుతున్నారు. దీన్ని సాధారణీకరించే యోచనలో కేంద్రం ఉంది. మరోపక్క నిపుణుల కమిటీ కనీస వేతనాలను నిర్ణయిస్తుందని ముసాయిదాలో పేర్కొన్నారు. ‘‘సాధారణ కూలీకి రూ.375 ఇవ్వాలని కార్మిక శాఖ ప్రతిపాదనల్లో పేర్కొంది. దాని ప్రకారం 26 రోజులకు 9750 అవుతుంది. నగరంలో ఉండే కార్మికులకు ఇంటి అద్దె అలవెన్స్‌గా మరో రూ.1430 చేర్చి కనీస వేతనం ఖరారు చేయాలని సలహాలు వచ్చాయి. ‘‘ కనీస వేతనం సరైన ప్రాతిపదిక కాదు. కుటుంబ నిర్వహణ వేతనమే సరైన అంచనా. పని గంటలను ఆరుకు తగ్గించాలి.’’ అని బీఎంఎస్‌ జాతీయాధ్యక్షుడు సాజీ నారాయణన్‌ చెప్పారు.

Courtesy Andhrajyothy..