* ఏటికేడాది తగ్గుతున్న వైనం
* రాష్ట్ర వాటాలోనూ తగ్గుదల

 అమరావతి:
కేంద్రం నురచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో భారీ కోత పడుతోంది. ఏటికేడాది ఈ నిధులు తగ్గుతుండటం చర్చనీయాంశంగా మారుతోంది. ఇలా కేంద్రం కోత పెడుతున్న నిధుల్లో నిబంధనల ప్రకారం రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన మొత్తం కూడా ఉండటం విశేఫం. ఈ పరిస్థితి అధికార యంత్రాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కొంత కాలంగా అనుసరిస్తున్న విధానాలు కూడా రాష్ట్ర ఆర్థికస్థితిపై ప్రతికూల ప్రభావాని చూపుతునాన్యని వీరు అంటున్నారు. వివిధ పథకాలకు దేశ వ్యాప్తంగా కేంద్రం పంచే నిధుల్లో రాష్ట్రానికి కేవలం ఐదు శాతమే నిధులు వచ్చాయి. ముఖ్యమైన, అతి ముఖ్యమైన పథకాలకు 2018-19లో కేంద్రర 3,04,849 కోట్ల రూపాయలను విడుదల చేసిరది. ఇరదులో రాష్ట్రానికి 15,527 కోట్లు మాత్రమే వచ్చాయి. విభజన నేపథ్యంలో తలెత్తిన సమస్యల పరిష్కారానికి కేంద్రం ఇచ్చిన హామీలను పరిశీలిస్తే ఇవి ఏ భాగంలో సగటున మూడు శాతం మాత్రమే చేతికందాయి.
ప్రధానమంత్రి గ్రామసడక్‌ యోజనలో 1.36 శాతం, పిఎంఎవైలో 2.11 శాతం రాగా, అరదులో గ్రామీణ విభాగానికి కేవలం 0.89 శాతం మాత్రమే వచ్చాయి. విద్యా విభాగంలో దాదాపు మూడు శాతం మాత్రమే నిధులు వచ్చినట్లు తేల్చారు. మరికొన్ని పథకాల్లో కూడా రెరడు, మూడు శాతానికి మాత్రమే నిధులు పరిమితమయ్యాయి. పన్నుల్లో వాటాగా రాష్ట్రానికి హక్కుగా వచ్చే మొత్తంలో అధికశాతం కార్పొరేషన్‌ ట్యాక్స్‌ నుండే రాష్ట్రానికి వస్తుంది. ఇటీవల కాలంలో ఈ టాక్స్‌లో కార్పొరేట్లకు భారీగా మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. దీని ప్రభావం రాష్ట్రంపై గణనీయంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ మినహాయిరపు వల్ల కేంద్ర ఖజానాకు 1.44 లక్షల కోట్ల రూపాయల వరకు చిల్లు పడిరది.దీని కిరద గత ఏడాది 10 వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి వచ్చాయి, తాజా మినహాయింపుల కారణంగా 42 శాతం తగ్గుతుందని అంచనా! దీని ప్రకారం 4 వేల కోట్ల రూపాయలకు పైగా కోత పడనుంది. 1.75 లక్షల కోట్ల రూపాయలను బఫర్‌ గ్రారటుగా రిజర్వ్‌బ్యారకు నురచి కేంద్రం ఇటీవల తీసుకున్న సంగతి తెలిసిందే.
ఈ మొత్తాన్ని కేంద్రం సొంత అవసరాలకు ఖర్చు చేయనుంది. వివిధ రాష్ట్రాల నురచి వసూలు చేసిన పన్నుల ద్వారా జమకూడిన ఈ నిధులను బఫర్‌ గ్రారట్‌గా కేంద్రం వాడుకోవడంపై వివిధ రాష్ట్రాలు అసంతృప్తితో ఉన్నాయి.

కేంద్రం నుండి నిధులు ఇలా…
సాధారణంగా రాష్ట్రానికి మూడు రకాల నిధులు కేంద్రం నుండి వస్తాయి. వాటిల్లో కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా నిధులు కీలకంగా ఉరటాయి. తరువాత వివిద్ణ పథకాలకు ఇచ్చే గ్రాంట్లు, స్థానిక, విదేశీ ఆర్ధిక సంస్థల నురచి ఇప్పిరచే రుణాలు ఉరటాయి. వీటిలో వాటా నిధులు, గ్రారట్లు తగ్గుతున్నట్లు అధిóకారులు చెబుతున్నారు.

పథకాలకూ వాతలే
కేంద్ర ప్రాయోజిత పథకాలకు కూడా కేంద్రర కోతలు విధిస్తోరది. ఒకవైపు డివల్యూషన్లను 42 శాతానికి పెరచినట్టే పెరచిన కేంద్రం… పలు పథకాలకు రద్దు చేసిరది. అయితే ప్రజల్లో ఆ పథకాల రద్దుపై వస్తున్న విమర్శల కారణంగా ఇప్పటికే అమలులో ఉన్న ఆ పథకాలను రాష్ట్ర ప్రభుత్వాలే కొనసాగిరచాల్సి వస్తోరది. ఇది రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితిపై భారంగా మారుతున్నట్లు కనిపిస్తోరది.

Courtesy Prajashakthi