చైనా నుంచి వచ్చిన పిల్లికి ఎట్టకేలకు విముక్తి

చైనా నుంచి వచ్చిన పిల్లికి మూడు నెలల క్వారంటైన్‌ పూర్తవడంతో విముక్తి కల్పించారు. ఫిబ్రవరి 17న చైనా నుంచి బొమ్మల లోడుతో చెన్నై పోర్టుకు వచ్చిన ఓ కంటైనర్‌లో ఉందిది. ముదురు గోధుమ రంగులో ఉన్న ఈ ఆడ పిల్లిని అధికారులు క్వారంటైన్‌లో ఉంచారు. మూడు నెలల నుంచి పూర్తి ఆరోగ్యంగా ఉండటంతో 23న చెన్నైలోని స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. ఎంపీ మేనకా గాంధీ, పెటా సంస్థల కృషితో పిల్లికి విముక్తి లభించింది.

Courtesy Andhrajyothi