Prof. Sujatha Surepally, Sathavahana University – Karimnagar

దళిత బాలికల , మహిళల మీద జరిగే అత్యాచారాలన్నిటికి మూలం కులమే, పిత్రుస్వామ్యం , వర్గం తోడవుతాయి , హింస పెరుగుతుంది. కుల నిర్మూలన దిశగా మన పాలకులు , ప్రజలు అడుగు వేయనంతవరకు మేము బలి కావలసిందే.

కులం పేరు ఎత్తగానే అందరూ చల్లబడతారు , కులం లేదు అని చెప్పడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు . అందులో ఆధిపత్యకులాల మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళూ ఉంటారు .

వాళ్ళు వాళ్ళ ఆడపిల్లలని పెళ్ళిళ్ళు చేసుకుంటే చంపేస్తారు , చూస్తే కాల్చేస్తారు . మరి దళిత పిల్లలు , ఆడవాళ్ళు బలి అయితుంటే దళిత , హక్కుల ఉద్యమాలు ఎక్కడ ? . సొషియల్ మీడియాలో రచ్చ చేస్తే గ్రామాల్లో హత్యాచారాలు ఆగుతయా ? మీడియా రాతలు కాస్త సమాచారాన్ని మాత్రమే ఇస్తాయి , కొద్దిగా చర్చ నడుస్తుంది , అనవసరం అనము కాని దానికి బయట ప్రపంచానికి సంబంధం నెలకొల్పినపుడే ఉద్యమాలు అయితాయి కదా .

ఎక్కడ మా మగధీర , వీర బాహుబలులు ? ఏ పార్టీలలో దాక్కున్నరు ? ( ఫీల్డ్ మీద ఉద్యమాలు చేసే వాళ్ళకి కాదు ఈ పోస్ట్ ) అక్కడో ఇక్కడో ఒకళ్ళిద్దరు మాట్లాడే ఆడవాళ్ళమీద ఆడిపోసుకోవడం ఆపి , దళితపులులని తయారుచేసి , గ్రామాల్లో , పట్టణాల్లో రక్షణ కల్పించలేరా ? ఆడవాళ్ళని కూడా కలుపుకొని అటువైపు అడుగులు వేయలేరా ? ఎంతసేపూ మేము తోపులం , మేము చెప్పిందే వేదం అనే పిత్రుస్వామ్య వితండవాదనలని చేయడమే తప్పితే ఇపుడు జరుగుతున్న ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొన్లేమా ? మనకి ఎక్కువ. శ్రమ లేకుండా శత్రువు సిగ్గువిడిచి బహిరంగంగానే వస్తున్నాడు . వ్యవస్థని పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకున్నాడు . విభజించి పాలించు అన్న సూత్రాన్ని పక్కాగా అనుసరిస్తున్నాడు . మనువాదాన్ని అందరి మసిష్కాల్లో ఎక్కిస్తున్నాడు . ఎం చేద్దాం ?ఇంకా , ఇంకా .. వార్తలు వింటూనే ఉందామా ? ఒక పొస్ట్ రాసి పడేసి .. జైభీం లు చెప్పెసి మరొక సంఘటన కోసం ఎదురు చూద్దామా ?

ఇందులో తప్పులెన్ని ఉన్నాయో చూపించి చర్చలు , వాదాలు చేసేబదులు , కలిసి ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తారని ఆశిస్తూ ..