పాట్నా : బీహార్‌లో కులాధారిత జనగణనకు సంబంధించిన తీర్మానానికి రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. జాతీయ కుల జనగణనను అమలుచేసేందుకు గానూ ఈ తీర్మానాన్ని శాసనసభ ఆమోదించిందని సభాపతి విజరు కుమార్‌ చౌదరి అన్నారు. ఎన్నార్సీకి వ్యతిరేకంగా తీర్మానం చేసిన రెండురోజులకే దీనిని తీసుకురావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మేరకు పాట్నాలో విజరు కుమార్‌ మాట్లాడుతూ.. దీనిద్వారా అన్ని కులాలకు చెందిన జనాభాపై కచ్చితమైన సమాచారం ఉంటుందనీ, తద్వారా సంక్షేమ పథకాలు ఎవరెవరికి చేరుతున్నాయనేదానిపై స్పష్టత వస్తుందని అన్నారు. దీన్ని కేంద్ర ఆమోదం కోసం పంపామని ఆయన తెలిపారు. అంతేగాక ఎన్పీఆర్‌లో వివాదాస్పదంగా ఉన్న కొన్ని క్లాజులను తొలగించాలని కూడా ఆయన కేంద్రాన్ని కోరారు.

Courtesy Nava Telangana