బెంగళూరు : సీఏఏపై వ్యతిరేకంగా నాటకం ప్రదర్శించారని ఆరోపిస్తూ కర్నాటకలోని బీదర్‌లో ఓ పాఠశాల యాజమాన్యంపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. జిల్లాలోని షాహీన్‌ ఎడ్యూకేషనల్‌ ఇనిస్టిట్యూట్‌లో ఈనెల 26 సాయంత్రం సీఏఏ, ఎన్నార్సీలపై ఓ నాటికను ప్రదర్శించారు. పాఠశాల విద్యార్థులు దీనిలో నటించారు. ఈ వీడియోను మహ్మద్‌ యూసుఫ్‌ రహీం అనే వ్యక్తి సోషల్‌మీడియాలో పోస్టు చేశాడు. అయితే, సీఏఏ అమలైతే దేశంలోని ముస్లింలందరూ భారత్‌ను విడిచివెళ్తున్నట్టు సందేశం వచ్చేలా నాటికను ప్రదర్శించారని ఆరోపిస్తూ పలువురు ఏబీవీపీ, హిందూత్వ సంస్థలకు చెందిన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు పాఠశాల యాజమాన్యంతో పాటు రహీంపైనా దేశద్రోహం కేసు నమోదు చేశారు.

Courtesy Nava Telangana