గుండాల : కరోనా ప్రభావంతో పెళ్లిళ్లు కళ తప్పాయి. ఎంతగా అంటే.. బంధు,మిత్ర,సపరివార సమేతంగా జరగాల్సిన వివాహాలు చివరకు పెళ్లికొడుకు కూడా రావడానికి వీలు లేనంతగా! పెళ్లి వేడుక ఆన్‌లైన్‌లోని అద్దాల తెరకే పరిమితమయ్యేంతగా!! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలకేంద్రానికి చెందిన ఓ ముస్లిం యువతి వివాహం ఇలాగే జరిగింది. సౌదీలో ఉంటున్న ఖమ్మం యువకుడితో ఆమెకు ఈనెల 15న నిఖా జరగాల్సి ఉండగా, కరోనా  కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో వరుడు భారత్‌కు రాలేకపోయాడు. దీంతో మత పెద్దలు ఆన్‌లైన్‌లోనే వరుడి అంగీకారాన్ని తీసుకొని పెళ్లి ఘట్టాన్ని పూర్తిచేశారు.

Courtesy Andhrajyothi