భద్రతా ప్రమాణాలు పట్టించుకోని రివర్‌ అథారిటీ 
– బయటపడ్డ బాధితులు 

రాజమహేంద్రవరం: లైసెన్సులేని బోట్లు, లాంచీలు, చిన్న మర పడవలు గోదావరిలో నిత్యం ఇష్టానుసారంగా ప్రయాణిస్తున్నాయి. వీటిని నియంత్రించాల్సిన గోదావరి రివర్‌ రెగ్యులేటింగ్‌ అథారిటీ, జలవనరులశాఖ, కాకినాడ పోర్టు అధికారులు చోద్యం చూస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో 40 ఎసి బోట్లు, 60 లాంచీలు, 300 నావలు, నాలుగు పంట్లు గోదావరిలో తిరుగు తు న్నాయి. బోటు యజ మానులు తమ లైసెన్సులను రెన్యువల్‌ చేయించు కోకుండా బోట్లను గోదావరిలో తిప్పుతు న్నారు. బోట్లలో భద్రతా ప్రమాణాలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉభయగోదావరి జిల్లాల్లోని బోట్లు, లాంచీలు, చిన్న మరపడవలు, పంట్లకు ధవళేశ్వరంలోని బోట్ల పర్యవేక్షణాధికారి లైసెన్సులను మంజూరు చేసేవారు. 2018లో కృష్ణా నదిలో బోటు మునిగిన సంఘటన తర్వాత బోట్ల లైసెన్సులు, రెన్యువల్‌ చేసే అధికారాన్ని కాకినాడ పోర్టు డైరెక్టరుకు ఇచ్చారు. గడువు ముగిసిన బోట్లు, లైసెన్సులు లేని బోట్లు కూడా గోదావరిలో నిత్యం తిరుగుతున్నా నిఘా కరువైంది. గడువు ముగిసిన బోట్లను, పాడైన బోట్లను తనిఖీ చేయాల్సిన అధికారులు ఆ పని చేయకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతు న్నాయని పర్యాటకులు ఆరోపిస్తు న్నారు. రాజమహేంద్ర వరం నుంచి అంగుళూరు, గండి పోశమ్మ, పేరంటపల్లి మీదుగా భద్రాచలం వరకూ 30 బోట్లు ప్రతిరోజూ తిరుగు తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం, సింగంపల్లి నుంచి భద్రాచలానికి మరో 30 బోట్లు తిరుగుతుటాయి. వీటిలో లైసెన్సులేని బోట్లే అధికం. రోజుకు వెయ్యి నుంచి రెండు వేల మంది పర్యాటకులు యాత్ర చేస్తున్నారు. రాజమహేంద్రవరం నుంచి 70 నుంచి 150 సిటింగ్‌ ఎసి, నాన్‌ ఎసి బోట్లు పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి. సాయంత్రం ఐదు గంటల తర్వాత బోటు ప్రయాణా నికి అనుమతి ఇవ్వకూడదు. రాత్రి సమయాల్లో కూడా బోటు ప్రయా ణానికి అనుమతిం చడంతో గోదావరి మధ్యలో బోట్లు నిలిచిపోయిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి.

దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద ఆదివారం జరిగిన బోటు ప్రమాదంలో 16 మంది ప్రాణాలతో బయటపడ్డారు. వారికి రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించారు. వారిని మంత్రులు ఆళ్ల నాని, కురసాల కన్నబాబు, జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి పరామర్శించి సంఘ టన వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మేలైన వైద్యం అందించాలని మంత్రులు ఆదేశించారు.

రంపచోడవరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు 
– బోసాల లక్ష్మి గోపాలపురం, అనకాపల్లి మండలం, విశాఖ జిల్లా
– దర్శనాల సురేష్‌, ఖాజీపేట మండలం, కడిపికొండ గ్రామం, వరంగల్‌ జిల్లా
– బసికె దశరధమ్‌, ఖాజీపేట మండలం, కడిపికొండ గ్రామం, వరంగల్‌ జిల్లా
– బసికె వెంకటస్వామి, ఖాజీపేట మండలం, కడిపికొండ గ్రామం. వరంగల్‌ జిల్లా
– దుర్గం మధులత, తిరుపతి, చిత్తూరు జిల్లా
– బొర్రె ప్రభాకర్‌ ఖాజీపేట మండలం, కడిపికొండ గ్రామం, వరంగల్‌ జిల్లా.
– చింతమాని జానకిరామారావు, ఉప్పల్‌, హైదరాబాద్‌, తెలంగాణ
– అరపల్లి యాదగిరి, ఖాజీపేట మండలం, కడిపికొండ గ్రామం, వరంగల్‌ జిల్లా
– కట్టపు గాంధీ గొల్లపూడి, విజయవాడ రూరల్‌
– దల్లా శివశంకర్‌, కోదాడ, సూర్యారావుపేట
– సోలేటి రాజేష్‌, సనత్‌నగర్‌, హైదరాబాద్‌, తెలంగాణ
– నార్లపురం సురేష్‌ జగద్గిరిగుట్ట, హైదరాబాద్‌, తెలంగాణ
– మజీరుద్దీన్‌, హైదరాబాద్‌, తెలంగాణ
– కిరణ్‌కుమార్‌, హైదరాబాద్‌, తెలంగాణ
– పాడి జనని కుమార్‌ హైదరాబాద్‌, తెలంగాణ
– కేరండ అర్జున్‌ హైదరాబాద్‌, తెలంగాణ

(Courtesy Nava Telangana)