అఖిలభారత రైతు సంఘాల పోరాట సమన్వయ సమితి పిలుపుతో జరిగే “గ్రామీణ భారత్ బంద్”కు UCCRI-(ML) మరియూ గ్రామీణ పేదలసంఘం (GPS), తెలంగాణసింగరేణి గని కార్మిక సంఘం(TSGKS)లు సంయుక్తంగా సంపూర్ణ మద్దతునిస్తున్నాయి.

ప్రజలారా! : దేశానికి తిండి పెట్టే రైతాంగాని కి “మంచి రోజులు వస్తాయని”, స్వామి నాథన్ కమీషన్ సిపార సు చేసినట్లుగా ఉత్పత్తి ఖర్చు లపై అదనంగా 50%కలిపి, కనీస మద్దతు ధర నిర్ణయిస్తామని,2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని “కేంద్రంలోని BJP (RSS)- మోడీ ప్రభుత్వం రైతులకు చూపిన ఆశలు అండి ఆశలే అయ్యాయి.

ప్రభుత్వ సంస్థలు కూడావివిధ సాకులతో రైతులు పండించిన పంటలకుమద్దతు ధరనిచ్చి కొనుగోలు చేయటం లేదు, ప్రభుత్వ అధికారులు, మధ్య దళారీలు, వ్యాపారులతో  కుమ్మక్కై, ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరను చెల్లించకుండా, రైతుల ఆర్థిక ఇబ్బందులను ఆసరా చేసుకొని తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ, రైతులను కొల్లగొట్టి, ధగా చేస్తున్నారు.

కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక, భూస్వామ్య, సామ్రా జ్యవాద,బడా పెట్టుబడిదారుల ,కార్పోరేట్ దోపిడి అనుకూల విదానాలను అనుసరిస్తూ, రైతుల పంటలకు సరిపడా బ్యాంకు రుణాలను సకాలంలో అందించక పోవటం, నిరంతరం పెరిగి పోతున్న అధిక ధరల కనుగుణంగా రైతాంగం పండిం చిన పంటలకు గిట్టుబాటు ధరను చెల్లించక పోవటంతో, పెట్టుబడికై తెచ్చిన అప్పులు పెరిగిపోయి, వాటిని తిరిగి కట్టలేని స్థితిలో రైతుల ఆత్మ హత్యలు విపరీతమైనాయి. అప్పుల బాదతో రైతులు తమకున్న కొద్దిపాటి భూములను అమ్ముకొని కూలీలుగా మారిపోతున్నారు. దేశ జనాభాలోని మెజారిటి ప్రజలు ఆధారపడి జీవించే వ్యవసాయ రంగంపట్ల యువత మొగ్గు చూపటం లేదు, దాంతో వ్యవసాయ రంగం పూర్తిగా దివాళ తీస్తున్నది.

వ్యవసాయ రంగానికి అనుబంధంగా పనిజేసే పాడి, పరిశ్రమలు తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టబడి, ఉత్పత్తిరంగం పూర్తిగా దెబ్బతిన్నది, దాంతో ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోయి, నామ మాత్రంగా ఉన్న చిన్న, మద్యతరహా, (వివిధ)పరిశ్రమలు మూతపడుతున్నాయి. చేతి వృత్తుల వారి నిజవేతనాలు పడిపోయాయి. వ్యవసాయ కూలీలకు పని దొరకని పరిస్తితి నెలకొని, వలస కూలీలు సంఖ్య పెరిగి, నిరుద్యోగుల సంఖ్య నానాటికి పెరగిపోతున్నది. మొత్తంగా దేశంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొన్నది. ఈ పరిస్తితులలో అధికారంలో ఉన్న పాలకులు ప్రబోదిస్తున్న కాంట్రాక్టు, కార్పోరేట్ వ్యవసా యం,విదేశీ పెట్టు బడులను అనుమతించటం, అన్ని పంట లకు జన్యు విత్తనాలను విని యోగించటం లాంటి విదానాలు వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్క రించ జాలవు.

మెజారిటీ ప్రజలకు వ్యవసాయ మే ప్రధాన జీవనాదారమైన మన దేశంలో మొదట దున్నే వారికే భూమిని పంచి, పంచిన భూమిని తిరిగి భూస్వాముల చేతుల్లోకిపోకుండాభూస్వామ్య  విదానాన్ని రద్దు చేయాలి. వ్యవసాయం చేసే రైతులకు అవసరమైన వాటన్నింటిని సమకూర్చి, పంటలకు సరిపడా బ్యాంకు రుణాలను సకాలంలో అందించి, సరైన పరివేక్షణలో ప్రోత్సహిస్తేనే, దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో గల మెజారిటీ ప్రజలకు చేతినిండా పనులు దొరికి, ప్రత్యక్ష నిరుద్యోగం తగ్గుతుంది, మూడుపూటల తిండికి పోను ఏర్పడిన మిగులుతో ప్రజల వస్తువు కొనుగోలు శక్తి పెరిగుతుంది, దాంతో తప్పనిసరి పరిశ్రమలను పెట్ట వలసి వచ్చి, 30శాతంగా ఉన్న యువత శక్తిని, సామార్థ్యాలను ఉపయోగించ వీలవుతుంది. తద్వారానిరుద్యోగ సమస్యకు పరిష్కారం దొరికి, దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని పరిష్క రించుకోగలుగుతాము. ఇన్నేళ్ళుగా అధికారంలో ఉన్న భూస్వామ్యవర్గ అనుయాయులైన ఈ బూర్జువా, పాలకులు, అధికార పార్టీలు ఈ మహత్తర కార్యాన్ని వారి వర్గం ప్రయోజనాల రీత్య నిర్వహించ లేదు, నిర్వహించవు, అదే సమయాన నిర్వహించ నియ్యవు.

కాబట్టి  మౌళికమైన భూమి, ప్రజాస్వామ్యం, స్వాతంత్ర్యంల సాధన కోసం, దేశంలోని అన్ని రంగాల మెజారిటీ ప్రజలంతా వ్యవసాయవిప్లవం సాధన కై నడుం బిగించాలని కోరుతున్నాం.

దానిలో బాగంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేఖ విదానాలను నిరసిస్తూ, గ్రామీణ పేదలు, ప్రజానీకం ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ, క్రింది 22 డిమాండ్ల సాధనకోసం తేది : 08-01-2020న అఖిల భారత రైతు సంఘాల పోరాట సమన్వ య సమితి. జరుపతల పెట్టిన  “గ్రామీణ భారత్ బందు”ను విజయ వంతం చేయవలసిం దిగా పిలుపు నిస్తున్నాము.

డిమాండ్లు 
1) అన్ని వ్యవసాయ పంటలకు మొత్తం ఉత్పత్తి వ్యయంపై 50శాతం కలిపి గిట్టుబాటు ధరలు నిర్ణయించి, ఖచ్చితంగా అమలు చేయటానికి వ్యవసాయదారులకు హక్కు కల్పిస్తూ, మార్కెట్లో అంతకు తక్కువ ధర వచ్చినచో ప్రభుత్వాలే ఆ లోటును బర్తీ చేస్తూ రైతులకు చెల్లించడానికి పార్లమెంటులో చట్టం చేయాలి. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. లేదా మార్కెట్లో కనీస ధర లభించేటట్లుగా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి. లేదా ధర తగ్గిన మేరకు ప్రభుత్వమే కొనుగోలుచేయాలి.

పసుపుకు గిట్టుబాటు ధరను నిర్ణయించి ఆర్మూరులో పసుపు బోర్డును ఏర్పాటుచేయాలి.

2) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసా యదారుల రుణవిమోచన చట్టాన్ని వెంటనే తీసుకు రావాలి.2016లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి న వ్యవసాయ రుణ విమోచనచట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి.

కె.సిఆర్ చేసిన పంట రుణాల రద్దు వాగ్దానాన్ని చిన్న, సన్నకారు, మద్య తరగతి రైతులందరికి పంట రుణాలను ఒకే దఫా రద్దుచేయాలి.

3) ఉపాధి హామీ పథకం క్రింద 200రోజులు పని కల్పించి, రోజుకు 450రూ.ల కూలి చెల్లించాలి.

4) వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలన్నింటికి సమగ్ర సామాజిక భద్రత కల్పించాలి. వ్యవసాయ కూలీలతో సహా, వ్యవసాయ కుటుంబాలన్నిం టికీ,సమగ్ర సామాజిక భద్రతాచట్టం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి. 60యేండ్లు పైబడిన రైతులకు, వ్యవసాయ కూలీలకు, చేతివృత్తుల వారికి నెలకు రూ.10వేలు ఫించను ఇవ్వాలి.

5) రాష్ట్రంలో మొత్తం భూముల సమగ్ర సర్వే చేయించి, భూతగాదాలను పరిష్కరించాలి.

6) నిత్యవసర సరుకులను బయో మెట్రిక్ గుర్తింపుతో అనుసంధానించ కుండా, ప్రత్యక్ష నగదు బదిలీకి మార్చ కుండా ప్రజా పంపిణి వ్యవస్థ ద్వారా అందరికీ అందుబాటులో సరపరా చేయాలి.

7) అడవి జంతువులు,కోతులు,ఇతర అవార పశువులు పంటలను నాశనం చేసినప్పుడు,పంటలు కోల్పోయిన రైతుకు ప్రభుత్వం పూర్తిపరిహారం చెల్లించాలి.పశువుల వ్యాపారంపై విధించిన ఆంక్షలు రద్దుచేయాలి.

8) 2013 భూసేకరణ చట్టాన్ని మాత్రమే అమలు చేసి, రైతులకు పరిహారం చెల్లించాలి, రాష్ట్ర ప్రభుత్వా లు తెచ్చిన సవరణ చట్టాలను రద్దు చేయాలి. వాణిజ్య అవసరాలకు వ్యవసాయ భూమిని మార్చకూడదు.

9)  చెరకు అమ్మిన రెండు వారాలలోగా ధరను రైతుకు ఇవ్వాలి. చెరకు బకాయిలు చెల్లించకపోతే 15 శాతం వడ్డీతో రైతుకు ఇవ్వాలి. చెరకు ధరను 9.5 శాతం రెకవరితో లింక్ చేసి, కేంద్రం గిట్టుబాటు ధరను క్వింటాలుకు రూ. 450లుగా నిర్ణయించాలి.

10) నిషేధించబడిన ఫెస్టిసైడ్స్ నూ, విత్తనాలనూ అమ్మిన కంపెనీలపై క్రిమి నల్ చర్యలు చేపట్టాలి. ప్రత్యామ్నా యాలు, ప్రభావం అంచనాలు లేకుండా, జన్యు విత్తనాలను ఆమోదించ కూడదు.

11)  వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్లలోకి (FDI)విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించరాదు. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యంతో (ఆర్ సీఐపి) సహా, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల నుండి వ్యవసాయాన్ని మినహాయించాలి.

12) ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడానికి కౌలు రైతులతో సహా వాస్తవసాగుదారులను గుర్తించి, రెవెన్యూ రికార్డుల్లో నమోదుచేసి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి.

13) గిరిజన రైతులను నిర్వాసితులను చేసి అడవుల నుండి బయటకు పంపటం ఆపాలి‌.పీసాచట్టం, అటవీ హక్కుల చట్టం 2006లను పటిష్టంగా అమలు చేయాలి.

14) భూమిలేని పేదలకు వ్యవసాయ, పెరడు భూమితో సహా భూమి, జీవన హక్కులు కల్పించాలి. దళిత, ఆదివాసి కుటుంబాలకు కెసీఆర్ వాగ్దానం చేసిన 3ఎకరాల భూమి కొనుగోలు పథకం కింద భూమిలేని కుటుంబాలన్నింటికి భూమి ఇవ్వాలి. ఉపాధి కల్పించడానికి భూవనరులను వినియోగించాలి.

15)  ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టానికి రైతుకు పరిహారం చెల్లించాలి. భూపేంద్రసింగ్ పాండా కమిషన్ నిర్ణయాలను అమలు జరపాలి. వ్యవసాయదారులందరికీ, అన్ని పంటలకూ భూకమతం ప్రాతిపదికగా మొత్తం నష్టపరిహారం అందే విధంగా సమగ్ర పంటల భీమా పథకం అమలు చేయాలి. పంటల భీమా ప్రిమియం మొత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాలి.

16) వర్షాధార ప్రాంతాలలోని రైతులకు స్థిరమైన మార్గాల ద్వారా సాగునీటి పారుదల వ్యవస్థను నిర్మించి, సాగునీటి వసతి కల్పించాలి.

17) పాల సేకరణ గిట్టుబాటు ధరలకు డైరీలు సేకరించే గ్యారంటీ చేయాలి. మధ్యాహ్న భోజన పథకం, సమగ్ర అభివృద్ధి పథకం, సమగ్ర బాలల అభివృద్ధి పథకంల ద్వారా పోషకాహార భద్రతను కల్పించాలి.

18) ఆత్మహత్య బాధిత కుటుంబాలకు అన్ని వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలి. ఆ కుటుంబాలవారి పిల్లలకు  విద్య, వైద్యాలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి.

19)  కాంట్రాక్ట్ ఫార్మింగ్ యాక్ట్ 2018ను సమీక్షించాలి. కార్పొరేట్లు చేస్తున్న నిలువు దోపిడి నుండి రక్షించాలి.

20) ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (ఎఫ్.పి.ఓ) లను రైతు కో-ఆపరేటివ్స్ గా మార్చాలి. ఆ సంస్థల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ ను అమలు జరపాలి.

21) చేతి వృత్తులను ఆధునీకరించి, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలి. సబ్సిడీపై రుణాలు ఇవ్వాలి.

22) ఆర్థికంగా లాభదాయకమైన పర్యావరణానికి అనుకూలంగా వున్న, వాతావరణాన్ని పునరుజ్జీవింప చేసే వ్యవసాయాన్ని అభివృద్ధి చేయటానికి తగిన పంటల పద్ధతులు, స్థానిక విత్తన వైవిధ్యాన్ని పునరుద్ధరించే విధంగా వ్యవసాయ వాతావరణానికి మార్పు ను ప్రోత్సహించాలి.

వ్యవసాయాన్ని కాపాడాలి!. –రక్షించాలి : జనవరి 8వ్యవసాయఉత్పత్తులు, ఆహార ధాన్యాలు పాలు, కూరగాయలు, పండ్లు తదితరాలు మార్కెట్లకు, పట్ట ణాలకు పంపడం ఆపివేసి,   “గ్రామీణ భారత్ బంద్”ను విజయ వంతంచేయండి.

తెలంగాణ సింగరేణి గని కార్మికసంఘం(TSGKS) : జున్ను అబ్రహాం రాష్ట్ర అధ్యక్షులు, గ్రామీణ పేదల సంఘం (GPS)  గడ్డం.సదానందం. రాష్ట్రకార్యదర్శి,  భారత కమ్యూనిస్టు విప్లవ కారుల సమైక్యతా కేంద్రం (మాలె) UCCRI-(ML). కిషన్ వర్గం. తెలంగాణ రాష్ట్రం #9494970334.