• చట్టం ముందు నిలబడదు..
  • ముందు నోటీసులు ఇవ్వాలి..
  • ట్రైబ్యునల్‌ తీర్పు ఇవ్వాలి
  • పోలీసుల ప్రకటనతో నిషేధమా?
  • 2005లోనూ చేయి కాల్చుకున్నారు
  • న్యాయ నిపుణుల అభిప్రాయం

మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ముద్రవేసి ప్రజాసంఘాలను నిషేధిత సంస్థల జాబితాలో చేర్చడం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేమని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నాలుగైదు దశాబ్దాలుగా కొనసాగుతున్న సంస్థలపై ఏకపక్షంగా నిషేధం చెల్లదంటున్నారు. 2005లో విప్లవ రచయితల సంఘం (విరసం)తోపాటు మరికొన్ని సంఘాలపై అప్పటి ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిషేధాలపై జస్టిస్‌ టి.ఎల్‌.ఎన్‌.రెడ్డి నేతృత్వం లో ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ట్రైబ్యునల్‌ విచారణ జరిపింది. ఈ ట్రైబ్యునల్‌ అన్ని పక్షాల వాదనలు ఆలకించి విరసంపై నిషేధం చెల్లదని తీర్పు చెప్పింది. దీంతో అప్పటి ప్రభుత్వం విరసంపై నిషేధాన్ని ఎత్తివేస్తూ జీవో జారీచేసిందిఅని న్యాయ నిపుణులు గుర్తు చేస్తున్నారు. సంఘం పెట్టుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కని, పాలకుల వ్యవహార శైలి ప్రజా వ్యతిరేకంగా ఉన్నప్పుడు నిరసన తెలిపే హక్కును ఆర్టికల్‌ 19 కింద పొందుపర్చారని ప్రస్తావించారు.

Courtesy Andhrajyothi.