బహుజనుల అస్త్రం అంబేద్కర్ పూలే సందేశం

 విద్యా భూషణ రావత్

హిందుత్వ పార్టీఇండియా ను సుదీర్ఘకాలం పాలించ నున్నది.ఇందుకోసం సంఘ పరివార్ శక్తులు ఎంతోకాలంగా కసరత్తు చేస్తున్నాయి ఎన్నికల ఫలితాలు ఇదే విషయాన్ని నొక్కి వక్కాణించాయ. 90ల మండల్ కమిషన్ అమలు తర్వాత నేడు ఉత్తరప్రదేశ్లో దళిత బీసీల ఐక్యతను చూసాం. దేశమంతా ఇది చర్చనీయాంశం అయ్యింది .అయితే బి ఎస్ పి, ఎస్ పి కూటమి ఈ ఎన్నికల్లో అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది .హిందుత్వభక్తులు తప్ప మిగిలిన విభిన్న కులాల వారు చాలావరకు ఒకరితో ఒకరు పోటీకి దిగుతున్నారు కానీ ఐక్యంగా నిలబడలేరని అర్థమైంది. ఇప్పుడు వారందరినీ సంఘటితపరచి అధికార వ్యవస్థ చేజిక్కించుకోవడమేమన కర్తవ్యం. ఐక్యత వల్ల మాత్రమే ఇది సాధ్యపడుతుంది. ఉత్తరప్రదేశ్,బీహార్లలో విభిన్న ఓబీసీ సముదాయాన్ని బిజెపి తన సోషల్ ఇంజనీరింగ్ ద్వారా ఆకట్టుకోగలిగింది . సంఘ పరివార్ ను ఎదుర్కోవాలంటే పెద్ద స్థాయిలో పచిత్తశుద్ధితో పని చేయాలి .దళిత బహుజనుల లో సైతం కింది వర్గాల వారిని హీనంగా చూడటానికి బదులుగా కలుపుకుపోయే విధంగా వారిని సమానంగా గౌరవించేలాగా మన పనితీరు ఉండాలి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి అంటే ఎన్నికల పోలింగ్ తేదీకి రెండు నెలల ముందు నుంచి అన్ని రకాల సర్వేలను నిషేధించాలి.1960 లలో కాంగ్రెస్ లా ఇప్పుడు బిజెపి పార్టీ ఆధిపత్యం నడుస్తుంది. నేడు రాస్ట్రాల స్థాయి నుంచి పునర్నిర్మించడమే పార్టీల తక్షణ కర్తవ్యం కావాలి .వారసత్వం బంధుత్వాలు పరీహరించి కొత్త రక్తాన్ని ఎక్కించటం, సాంస్కృతిక కార్యకర్తలు, మేధావులతో సరికొత్తగా సామాజిక బృందాన్ని తయారు చేయడమే తక్షణ కర్తవ్యం కావాలి .అవినీతిపై రాహుల్ గాంధీ మోడీ ని విమర్శించటం, చౌకీదారు నినాదంపనిచేయలేదు. అవినీతి విషయమై కాంగ్రెస్ రికార్డు అందరికీ తెలిసిందే మనం కులాలు ఓటులెక్కలు వేసుకుంటే అమిత్ షా ఓటర్లను బూతువరకూరప్పించి ఓటింగ్ జరిపించుకునే ఎత్తుగడలో ఉన్నారు. ఎస్పి, బిఎస్పి, ఆర్.ఎల్.డి ఓటర్లు ఒకరికొకరు మద్దతుగా నిలవలేదని నేను గట్టిగా చెప్పగలను. ప్రజలు ఈ శక్తుల మధ్య దీర్ఘకాలిక ఐక్యత కోరుకుంటారు.హటాత్తుగా రమ్మంటే ఇది జరిగేది కాదు .నేడు దేశ వ్యాప్తంగా మనం బహుజనుల ఐక్యతను నిర్మించాల్సిన అవసరం ఉన్నది
. బాబాసాహెబ్ అంబేద్కర్ ,పూలే ,భగత్సింగ్ సిద్ధాంతాన్ని ప్రజల ముందుకు శక్తివంతంగా తీసుకెళ్లాలి .ఇందుకోసం అలుపెరుగని కృషి అవసరం. రాజ్యాంగం ఇచ్చిన సామాజిక న్యాయం ,సమాన గౌరవం, మానవత్వంతో కూడిన సమాజం కోసం పోరాటం చేస్తున్నాం. ఈ పని సామాజిక మాధ్యమాల కే పరిమితం కారాదు.అన్ని వేదికలకు వెళ్ళాలి .ప్రతి ఒక్కరినీ కలిసి ఈ సందేశాన్ని బలంగా నాటాలి .మన అందరికీ ఆసక్తి,ఉత్సాహం ఉన్నది .మానవ హక్కుల కోసం జరిపే మన పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. (రచయిత మానవ హక్కుల కార్యకర్త) .