బాహుబలి వీడియో రీ ట్వీట్‌

వాషింగ్టన్‌ : భారత ప్రధాని మోదీ తన స్నేహితుడని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పేర్కొన్నారు. భారత పర్యటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆదివారం ఆయన శ్వేతసౌధం వద్ద విలేకరులతో చెప్పారు. అంతకు ముందు ఆయన ట్విటర్‌లో సూపర్‌ హిట్‌ సినిమా బాహుబలిలో సన్నివేశాలకు హీరో ముఖానికి బదులు ట్రంప్‌ ముఖాన్ని పెట్టి రూపొందించిన ఓ యానిమేటెడ్‌ వీడియోను రీ ట్వీట్‌ చేశారు. తనకు ఓ ఫ్రెండ్‌ పంపిన బాహుబలి వీడియో చూసి స్ఫూర్తి పొంది.. తొలిసారి బాహుబలి థీమ్‌ మీమ్‌ను రూపొందించినట్లు వీడియో రూపకర్త తెలిపారు. తొలిసారి బాహుబలి థీమ్‌ వీడియోను గత నెల 23న ట్రంప్‌ అభిశంసన ఎదుర్కొంటున్న సమయంలో విడుదల చేసినట్లు వెల్లడించారు. దానికి ‘జియో రే బాహు ట్రంప్‌’ అనే శీర్షిక పెట్టారు. ఈ వీడియోను ట్రంప్‌ రీ ట్వీట్‌ చేయడంతో వైరలైంది. 10 లక్షల మందికి పైగా ఈ వీడియోను చూశారు.

Courtesy Andhrajyothi