ఢిల్లీలో భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌

హైదరాబాద్‌భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఢిల్లీకి చేరుకున్నారు. సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక నిసరసనల్లో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లో ఓ కార్యకమ్రానికి వచ్చిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఉదయం విమానంలో ఢిల్లీకి పంపించారు. దీనిపై ఆజాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే తెలంగాణకు తిరిగి వస్తానన్నారు. ‘‘తెలంగాణలో నియంతృత్వం తారస్థాయికి చేరుకుంది. నిరసన తెలిపే హక్కును ప్రజల నుంచి లాక్కున్నారు. మా వాళ్లను కొట్టారు. తరువాత నన్ను అరెస్టు చేశారు. బహుజన సమాజం ఈ అవమానాన్ని ఎన్నటికీ మర్చిపోదు’’ అని ఆయన ట్వీట్‌ చేశారు. తెలంగాణ సీఎంవోను ట్యాగ్‌ చేశారు. కాగా, చంద్రశేఖర్‌ ఆజాద్‌ అరెస్టును విప్లవ రచయితల సంఘం(విరసం) ఖండించింది. మరోవైపు ఆజాద్‌ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు తెలిపారు.

Courtesy Andhrajyothi