సిడ్నీ : ఆస్ట్రేలియా తొలి మహిళా ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా రాచెల్‌ నోబెల్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియన్‌ సిగల్స్‌ డైరెక్టరేట్‌ (ఏఎస్‌డీ) డీజీగా రాచెల్‌ను నియమించ నున్నట్టు తెలిపారు. ఆస్ట్రేలియాలో సైబర్‌ దాడులు పెరిగిపోయా యని అన్నారు. ఇలాంటి దాడులు జరగ కుండా ఉండాలంటే పటిష్ట భద్రతా ప్రమా ణాలను, అధునాతన వ్యవస్థను రూపొందించాల్సిన అవసరమున్నదని అన్నారు. రాచెల్‌ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించగలరని స్కాట్‌ మారిసన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏఎస్‌డీ డీజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మైక్‌ బర్గెస్‌కు ఆస్ట్రేలియన్‌ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్‌ ఆర్గనైజేషన్‌ డీజీ బాధ్యతలు అప్పగిస్తామని ప్రధాని తెలిపారు. మహిళా సాధికారత కోసం ఆస్ట్రేలియా కృషి చేస్తోందని, అందుకే ఓ మహిళకు కీలక పదవి అప్పగించామని అన్నారు. కాగా, ఏఎస్‌డీ డీజీగా బాధ్యతలు చేపట్టనున్న రాచెల్‌ నోబెల్‌ను ఆస్ట్రేలియా రక్షణ మంత్రి లిండారెనాల్డ్‌ అభినందించారు.

Courtesy Nava telangana…