భారత రాజ్యాంగం రాజ్యాంగ పరిషత్‌ ఆమోదం పొంది నేటికి 70 ఏండ్ల యింది. 1949 నవంబరు 26న రాజ్యాంగ పరిషత్‌ రాజ్యాంగాన్ని ఆమోదించి, జాతికి అంకి తం చేసింది. 1946 డిసెంబరు 13న జవహర్‌ లాల్‌ నెహ్రూ ప్రతిపాదించిన రాజ్యాంగ లక్ష్యాల తీర్మానం రాజ్యాంగంలో పీఠికగా రూపొందినది. రాజ్యాంగ పీఠిక భారతదేశాన్ని ‘సర్వ సత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా’ ప్రకటించింది. గత 70 ఏళ్లలో 104 రాజ్యాంగ సవరణలు జరిగాయి. వాజ్‌పేయి ప్రధాన మంత్రిగా ఉండగా నియమించిన రాజ్యాంగ సమీక్ష కమిషన్‌ కూడా ప్రస్తుత రాజ్యాంగం సమున్నతమైనదని తేల్చి చెప్పింది.
సమాఖ్య విధానం
భారతదేశం ఆచరణలో సమాఖ్యగా ఉండా లని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. 1వ నిబంధనలో దేశాన్ని ‘రాష్ట్రాల యూనియన్‌’ అని పేర్కొన్నారు. 7వ షెడ్యూల్‌లో అధికారాన్ని కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా లుగా విభజించారు. రాష్ట్రాల అధికారాలు పెం చడానికి గతంలో సర్కారియా కమిషన్‌, పూంచీ క మిషన్లను నియమించారు. మోడీ 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జీఎస్టీ ప్రవేశపెట్టడం ద్వారా రాష్ట్రాలకు వచ్చే పన్నుల ఆదాయం తగ్గిపోయింది. కేంద్ర ప్రా యోజిత పథకాలకు కేంద్రం వాటా తగ్గించి ంది. పెద్ద నోట్ల రద్దు వలన రాష్ట్రాలలో వేలాది పరిశ్రమలు మూతబడి ఆదాయం కోల్పోయా యి. 15వ ఆర్థిక సంఘం ప్రతిపాదనలు దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలిగించేవిగా వున్నాయి. నరేంద్రమోడీ, అమిత్‌షా రాష్ట్రాలలో తమ ప్రభుత్వాలు ఏర్పడాలని రాష్ట్రానికి ఒక రకమైన ఎత్తుగడను అనుసరిస్తున్నారు. త్రిపుర, గోవా, మణిపూర్‌ మొదలగు రాష్ట్రాలలో అధికారం కోసం నీతి బాహ్యమైన విధానాలు అనుసరించారు. ఈ వారంలో మహారాష్ట్రలో తమ ప్రభుత్వ ఏర్పాటుకు చేసిన ప్రయత్నం ప్రజాస్వామ్య విరుద్ధమైనది.
రాజ్యాంగ నిర్మాతలు పూర్తిగా చర్చించి జ మ్ము, కాశ్మీర్‌కు 370వ నిబంధన ద్వారా ప్రత్యేక ప్రతిపత్తి కల్పించారు. ఈ నిబంధన తమకు పా ర్లమెంటులోగల మెజారిటీని ఉపయోగించు కొ ని రద్దు చేసి, కేంద్రపాలిత ప్రాంతంగా చేయ డం సమాఖ్య విధానానికి పూర్తి వ్యతిరేకం. రా జ్యాంగంలో 5,6 షెడ్యూళ్లలో ఈశాన్య రాష్ట్రాల లో గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక హక్కులు కల్పి ంచారు. 371 ద్వారా మహారాష్ట్ర, గుజరాత ్‌కు, 371-ఎ ద్వారా నాగాలాండ్‌, 371-బి ద్వారా అసోం, 371-సి ద్వారా మణిపూర్‌, 371-డి, ఇల ద్వారా ఏపీ, 371-ఎఫ్‌ ద్వారా సిక్కిం ప్రత్యే క హక్కులు కలిగివున్నాయి. గిరిజన హక్కులు కాపాడటానికి 1/70 చట్టం అమలు లో ఉంది. ఇన్ని ఉండగా, మోడీ ప్రభుత్వం కేవ లం జమ్ము, కాశ్మీరీకి సంబంధించి 370వ నిబం ధన రద్దు చేయడం ప్రజలలో మతపరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి మాత్రమే. ఈవా రం కాశ్మీర్‌లో పర్యటించిన మాజీ ఆర్థికమంత్రి యశ్వంత్‌ సిన్హా నాయకత్వ బృందం కూడా జ మ్ము, కాశ్మీర్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నా యని చెప్పింది.
లౌకిక విధానం
రాజ్యాంగంలో 25-28 మధ్య నిబంధ నలు పౌరులకు మత స్వేచ్ఛ కల్పించాయి. భారతదేశంలో 5 వేల సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో ‘ఉమ్మడి సంస్కృతి’ రూపుదిద్దుకున్నది. హిందూ, బౌద్ధ, జైన, ఇస్లాం, క్రైస్తవ, సిక్కు, పా ర్శీ మతాల ఆచార, సాంప్రదాయాలతో భారత జీవన విధానం రూపొందింది. భారత ఉమ్మడి సంస్కృతి, సాంప్రదాయాలను దెబ్బతీసి ‘హిం దూత్వ’ విధానాలు ప్రవేశ పెట్టడానికి మోడీ ప్ర భుత్వం ప్రయత్నిస్తున్నది. అయోధ్యలో రామాల య నిర్మాణం, శబరిమలైలో స్త్రీల ప్రవేశంపై సుప్రీంకోర్టు తీర్పుపై బీజేపీ విధానాలు, తలాక్‌ చట్టాలు మొదలగు వాటితో ప్రజలలో భావోద్వే గాలు రెచ్చగొట్టి మతపరమైన విభజనకు ప్రయ త్నిస్తున్నది.
భారత రాజ్యాంగ పరిష త్‌లో డా|| అంబేద్కర్‌, నెహ్రూ మొదలగు వారందరూ పార్ల మెంటరీ విధానం ఉండాలని భావించారు. మోడీ ప్రభు త్వం రాజ్యాంగ లక్ష్యాలకు తూట్లు పొడిచే విధంగా దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యా న్ని అమెరికా వలె అధ్యక్ష పాలనా విధానంలోకి మార్చాలనే ఆలోచనలు కొనసాగుతున్నాయి.
భావ ప్రకటనా స్వేచ్ఛ
రాజ్యాంగంలోని 3వ భాగంలో పౌరులకు ఆరు ప్రాథమిక హక్కులు కల్పించారు. వీటిలో 19వ నిబంధన ద్వారా కల్పించిన భావ ప్రకట నా స్వేచ్ఛ అతి ముఖ్యమైనది. మోడీ ప్రభుత్వం లో భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి జరుగుతున్న ది. భిన్నాభిప్రాయాలను రాజద్రోహ నేర ంగా ప్రకటి స్తున్నారు. ఇటీవల ప్రధానికి లేఖ రాసిన మేధావులపై రాజ ద్రోహం నేరం మోపాలని భావించారు. ఢిల్లీ జవ హార్‌లాల్‌ నెహ్రూ, హైదరాబాద్‌ సెంట్ర ల్‌ యూనివర్శిటీ తదితర చోట్ల భిన్నాబి ప్రాయాలు వ్యక్తం చేసే వాతావరణం లేదు. భిన్నా భిప్రాయాలు వ్యక్తం చేసిన నరేంద్ర దభోల్కర్‌, గోవింద పన్సారేలను కర్నా టకలో ఎం.ఎం కల్బుర్గిని హత్య చేశారు. హిందూత్వ సనాతన ధర్మ సంస్థలు ఈ హత్యలు చేశాయని ఆధారాలు ఉన్నాయి. ఇంతవరకూ నిందితులను అరెస్టు చేయలేదు.
స్వతంత్ర న్యాయ వ్యవస్థ
ప్రభుత్వ అంగాలైన కార్యనిర్వాహక వర్గం, శాసన నిర్మాణ శాఖ, న్యాయ వ్యవస్థలు స్వతం త్రంగా పనిచేయాలని రాజ్యాంగంభావించింది. జస్టిస్‌ విఆర్‌.కృష్ణయ్యార్‌, ఒ.చిన్నప్పరెడ్డి, పి ఎన్‌.భగవతి, వైవి.చంద్రచూడ్‌ వంటి న్యాయ మూర్తులు న్యాయ వ్యవస్థ స్వతంత్రతను నిలబెట్టారు. మోడీ ప్రభుత్వం న్యాయ వ్యవస్థ వ్యవహా రాలలో జోక్యం చేసుకుం టున్నది. ఇటీవల మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యా యమూర్తిని మేఘాలయా హైకోర్టు ప్రధాన న్యా యమూర్తిగా బదిలీ చేయడం దీనిలో భాగమే. గత సంవత్సరం ‘కొలీజియం’లోని నలుగురు న్యాయమూర్తులు ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించి త మ నిరసనను జస్టిస్‌ చలమేశ్వర్‌ ఆధ్వర్యంలో తె లియజేయడం ప్రభుత్వం జోక్యం వలనే.

ఏపీ శాసనమండలి సభ్యులు
కె.ఎస్‌.లక్ష్మణరావు