దళితవాడలో దారుణం.. తల్లీకూతుళ్ల బట్టలు విప్పేసి..

మహాభారతం పునరావృతమైంది. ఆడవారిని అవమానించాలంటే బట్టలు విప్పాలన్నఅనాగరిక చర్య.. తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. రాజమండ్రి బిక్కవోలు దళితపేటలో ఓ తల్లికి, ఆమె కూతురి(11)కి అవమానం జరిగింది. భూమి తగాదాలో బంధువులే వారిపై దాడి చేసి బట్టలు విప్పారు. చెట్టుకు కట్టేసి హింసించారు. బాధితులు సాయం కోసం అరచి కేకలు వేసినా ఫలితం లేకపోయింది.

https://youtu.be/BukO_X_YB9c

బాధిత తల్లి కొడుకైన ఏడేళ్ల బాలుడు దీన్ని వీడియో తీశాడు. తర్వాత ఆ బంధువులే ఆ వీడియోను షేర్ చేశారు. విశాఖపట్నం ఎస్బీఐ బ్రాంచిలో మేనేజర్‌గా పనిచేస్తున్న రాజుకు బాధిత కుటుంబంతో భూమి విషయంలో గొడవ వుంది. దీంతో సోమవారం రాజు, ఇద్దరు మహిళలతో కలసి బాధితురాలి ఇంటికి వచ్చి దాడి చేశాడు. ఆమె చీరవిప్పి కళ్లలో కారం కొట్టారు. కాపాడటానికి కూతురు అడ్డం రాగా, ఆమె బట్టలనూ చించేశారు. పోలీసులు ఈ ఉదంతంపై కేసు నమోదు చేసుకుని రాజును, ఇతర నిందితులను అరెస్ట్ చేసి, కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.

 

 

 

Leave a Reply