అసోం గణ పరిషత్‌

గువహతి: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను తమ రాష్ట్రంలో బహిష్కరి స్తామని బీజేపీ మిత్రపక్షం అసోం గణ పరిషత్‌( ఏజీపీి) షాకిచ్చింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేశామనీ, ప్రజల అస్థిత్వాన్ని ప్రశ్నార్థకంగా మార్చే పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) రాష్ట్రంలో అమలు చేయబోనివ్వమని ఏజీపీి తెల్చి చెప్పింది. ఆదివారం ఆ పార్టీ అధ్యక్షుడు అతుల్‌ బోరా మీడియాతో మాట్లాడుతూ.. అసోం ప్రజల ప్రయోజ నాలకు వ్యతిరేకంగా ఎప్పటికీ నడుచుకో మని హామీ నిచ్చారు. సీఏఏకు వ్యతి రేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రాంతీయ పార్టీ ఏజీపీ అని తెలిపారు. తమ పార్టీ వైఖరిని ప్రజలు సూక్ష్మంగా గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేశవ్‌ మహంత ూట్లాడుతూ.. అసోం సాంస్కృతిక, సాంఘిక, భాషా గుర్తింపు, వారసత్వాలకు రాజ్యాంగపరంగా సరరక్షించుకోవడానికి అసోం ఒప్పందంలోని ఆరో నిబంధన భద్రత కల్పిస్తున్నదనీ, అలాగే స్థానిక ప్రజలకు కూడా రక్షణ కల్పించాలని పార్టీ కోరుకుంటుందని అన్నారు. ఇతర ఈశాన్య రాష్ట్రాల మాదిరిగానే అసోం కూడా సీఏఏ పరిధి నుండి బయటపడాలని డిమాండ్‌ చేశారు చట్టానికి వ్యతిరేకంగా పిటిషన్‌ దాఖలు చేశామనీ, న్యాయ పోరాటం ద్వారా సాధ్యమవుతుందని అన్నారు. పార్లమెంటులో సీఏఏకు వ్యతిరేకంగా మాట్లాడి, రాజ్యసభలో బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.

(Courtesy Nava Telangana)