అరుంధతీ రాయ్ రచించిన పుస్తకం
ఏబీవీపీ ఫిర్యాదు నేపథ్యంలోనే ఎంఎస్‌యూ నిర్ణయం

చెన్నై : ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ రచిం చిన ‘వాకింగ్‌ విత్‌ ది కామ్రేడ్స్‌’ పుస్తకాన్ని ఎం ఏ. ఇంగ్లీషు సిలబస్‌లో ఉన్న పాఠ్యాంశం పట్ల ఆరెస్సెస్‌ అనుబంధ విద్యార్థి విభాగం ఏబీవీపీ అభ్యంతరాల నేపథ్యంలో తమిళనాడులోని తిరున్‌ వేెలిలో ఉన్న మనోన్మాణియం సుందరనార్‌ విశ్వ విద్యాలయం (ఎంఎస్‌యూ) ఆపాఠాన్ని సిలబస్‌ నుంచి తొలగిం చింది. అరుంధతీ ఈ పుస్తకాన్ని మావోయిస్టులు ఉండే రహస్య ప్రాంతాలు, స్థావరాల సందర్శన ఆధారంగా రచించారు. మనోన్మాణియం సుందరనార్‌ వర్సిటీ వైస్‌చాన్సలర్‌ కె. పిచ్చు మణి నేతత్వంలో జరిగిన ఈ సమావేశంలో పాఠ్యాంశాన్ని తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. దీని స్థానంలో ప్రముఖ శాస్త్రవేత్త ఎం.కష్ణన్‌ రచించిన ‘మై నేటివ్‌ ల్యాండ్‌ ఎస్సేస్‌ ఆన్‌ నేచర్‌’ లోని కొన్ని వ్యాసాలతో భర్తీ చేయాలని నిర్ణయించారు. దీనిపై వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ కె.పిచ్చుమణి మాట్లాడుతూ.. అరుంధతీ రాయ్ రచించిన ఈ పుస్తకాన్ని 2017లో ఎంఏ ఇంగ్లీష్‌ మూడో సెమిస్టర్‌ సిలబస్‌లో చేర్చామన్నారు.

ఇటీవలి కాలంలో రచయిత్రి.. మావోయిస్టులకు అనుకూలంగా నడుచుకుంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందనీ, దీనిపై చర్చించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ‘వాకింగ్‌ విత్‌ ది కామ్రేడ్స్‌’ను సిలబస్‌ నుంచి తొలగించాలని కమిటీ సిఫారసు చేసిందని చెప్పారు. ఏబీవీపీతో పాటు ఇతరులు కూడా ఫిర్యాదు చేయడంతో పాటు పలు సమస్యలను లేవనెత్తడంతో ఈ పుస్తకాన్ని సిలబస్‌ నుంచి తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.ఏబీవీపీ దక్షిణ తమిళనాడు సంయుక్త కార్యదర్శి సి.విగేష్‌ మాట్లాడుతూ.. జాతి వ్యతిరేక మావోయిస్టులకు బహిరంగంగా ఈ పుస్తకం మద్ధతు నిస్తుందనీ, దీనిని సిలబస్‌ నుంచి తొలగించాలని ఆయన వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే రారు రచనను సిలబస్‌ నుంచి తొలగించారు.

Courtesy Nava Telangana