చారిత్రాత్మక ఆర్టీసీ సమ్మె 33వ రోజుకు చేరింది. తెలం గాణ హైకోర్టు కూడా సమ్మె విషయంలో చారిత్రాత్మక పాత్ర పోషిస్తోంది. న్యాయస్థానం అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం వ ద్ద సమాధానాలు లేవు. చివరకు విసుగెత్తిన న్యాయస్థానం నవం బరు ఏడో తేదీన కీలకమైన అధికార యంత్రాంగం హాజరు కావా లని ఆదేశించింది. సాధారణంగా ఏ వివాదం అయినా న్యాయస్థా నంలో ఉన్నప్పుడు న్యాయస్థానం తుది నిర్ణయం వచ్చే వరకు వేచి ఉండటం ప్రజాస్వామ్యంలో కనీస ప్రమాణం. దేశంలో అత్యంత కీలకమైన అయోధ్య వివాదం కూడా సుప్రీం తీర్పు కోసం వేచి ఉ ంది. కానీ తెలంగాణ సర్కారు మాత్రం హైకోర్టు డైరెక్షన్‌ను పక్కన పెట్టి తాను కోరుకున్న, ముందుగా నిర్ణయించుకున్న మార్గంలో ముందుకెళ్తోంది. ప్రభుత్వ దుందుడుకు చర్యలు గమనిస్తే హైకోర్టును సైతం ధిక్కరించేంతగా ఈ ప్రభుత్వంపై పని చేస్తున్న ఒత్తిళ్లు ఏమిటి? ఎవరి ఒత్తిళ్లు అన్న ప్రశ్న తలెత్తుతుంది.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచీ హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వానికీ ఖటీఫ్‌ అన్న చందంగానే నడుస్తోంది. అందుబాటు లో ఉన్న సమాచారం మేరకు దాదాపు 70 సందర్భాల్లో ప్రభుత్వ నిర్ణయాలను తిరస్కరించటమో, రద్దు చేయటమో, సమీక్షించట మో చేసింది హైకోర్టు. ఏ ప్రభుత్వంలో అయినా ఎక్కడో ఓ చోట ఏదో ఓవిషయంలో పొరపాటు జరుగుతుంది. కానీ కేసీఆర్‌ దొర తనంలో అన్ని సార్లు హైకోర్టు చేత చివాట్లు పెట్టించుకోవాల్సిన ప నులు ఎందుకు చేస్తున్నారు? ఏ రాజకీయ ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు హైకోర్టు చివాట్లను సైతం లెక్కచేయకుండా ముం దుకెళ్లేలా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి? ఈ ప్రశ్నలకు ప్రజలే సమాధానం వెతకాలి.
హైకోర్టుకు, తెరాస ప్రభుత్వానికి మధ్య ఉన్న వాదాల్లో మ చ్చుకు కొన్ని వివాదాలు పరిశీలిద్దాం. అన్నింటి కంటే ముఖ్యమైన ది సచివాలయ నిర్మాణం. ఆలోచన ఉన్న వాండ్లు ఎవరైనా పాత ఇల్లు పడగొట్టాలన్నా,అమ్మాలన్నా ముందు కొత్త ఇల్లు కట్టుకునో, అద్దె ఇల్లు వెతుక్కోవటమో చేస్తారు. కానీ సచివాలయం విషయం లో ప్రభుత్వం దఫ దఫాలుగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టి కూల్చివేత నిర్ణయాలు చేసింది. బైసన్‌ గ్రౌండ్‌ తమకు ఉన్న ఫళంగా కేటాయించాలని డిమాండ్‌ చేసింది. హోమంత్రితో జరిగి న సమావేశంలో బైసన్‌ గ్రౌండ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయిస్తామా లేదా అన్నదాంతో నిమిత్తం లేకుండా సచివాలయం ఖాళీ చేయాలన్న నిర్ణయం ఏ విధంగా సమంజసమైన నిర్ణయం అని ప్రశ్నించినట్టు వార్తలు వచ్చాయి. ఇలాంటి విషయాలు దాదాపు ప్రజల దృష్టికి రాకుండానే దాటిపోతున్నాయి.
రాష్ట్ర విభజన అనంతరం ప్రభుత్వం ప్రధానంగా సిబ్బంది వి షయంలో తీసుకున్న అనేక నిర్ణయాల ను హైదరాబాద్‌ హైకోర్టు రద్దుచేయట మో, సమీక్షించటమో చేసింది. ఉదాహ రణకు స్థానికత విషయంలో 1956 నా టి స్థానికతను తెరమీదకు తెస్తూ ప్రభు త్వం రూపొందించిన పథకాన్ని కోర్టు కొ ట్టేసింది. ఆంధ్ర స్థానికత ఉన్న విద్యుత్‌ ఉద్యోగులను బాధ్యతల నుండి రిలీవ్‌ చేయటాన్ని హైకోర్టు తప్పు పట్టింది. ఫలితంగా వాళ్లందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాల్సి వచ్చింది. నీటిపారుదల శాఖలో సైతం 250 మందిపై వేటు వేయటానికి పూనకుంటే హైకోర్టు అడ్డు పడింది. చివరకు రాష్ట్ర ప్రభుత్వం కాళ్ల బేరానికి వచ్చి ఆ 250 మందిని తిరిగి ఉద్యోగాల్లోకి తీస

న్యాయశాఖ అధికారుల నియమామకంలో రోస్టర్‌ పద్ధతిని అమలు జరపకుండా ఉండేందుకు అనుమతి ఇవ్వాలన్న ప్రభుత్వ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. చివరకు రోస్టర్‌ పద్ధతిలోనే నియామకాలు జరిగాయి. గత మున్సిపల్‌ ఎన్నికలకు ముందు కా ంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ రాజకీయ ప్రయోజనం కో సం తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు తిరస్కరించింది. వెనకబడిన కు లాల జనగణన లేకుండా పంచాయితీ ఎన్నికలు జరపటం ఎన్నికై న వేదికల్లో వెనకబడిన కులాల ప్రాతినిధ్యాన్ని తిరస్కరించట మేనని హెచ్చరించింది. పరిపాలన సౌలభ్యం పేరుతో జిల్లాలను చీల్చిన తర్వాత ఆయా జిల్లాల వారిగా ఉపాధ్యాయ నియామకాల కోసం ప్రభుత్వం తీసుకున్న ఒంటెత్తు నిర్ణయం విషయంలో హై కోర్టు మందలించింది. పాత జిల్లాల ప్రకారమే డిఎస్సీ నియమాకా లు జరిగేలా ఆదేశాలిచ్చింది. ఇవే కాక స్థానికత నినాదంతో ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను కోర్టు కొట్టేసింది.
ఇవికాక ఫోన్‌ ట్యాపింగ్‌, నంబర్‌ పేట్ల మార్పు, ఇంటర్‌ బోర్డు ఖాతాల స్థంభన, ఎర్రమంజిల్‌ కూల్చివేత, రేవంత్‌ రెడ్డి బెయిల్‌, పార్లమెంట్‌ కార్యదర్శుల నియామకం, తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పు, పార్టీ ఫిరాయింపులు, మల్లన్న సాగర్‌ భూములకు నష్టపరిహారం, నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ జోన్‌ (నిమ్జ్‌) జిఓ రద్దు, తెలంగాణ డిస్కం ఉద్యోగుల వివాదం, సాంస్కృతిక శాఖలో జరిగిన రాజకీయ నియామకాలు, కాంగ్రెస్‌ ఎమెల్యేలపై అనర్హత వేటు రద్దు, విద్యా సంస్థ ప్రవేశాల్లో సాంస్కృతిక కోటా రద్దు, రైతు సమన్వయ కమిటీల పేర నిధుల దుబారా, వైస్‌ ఛాన్సలర్ల నియామకం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, బయో డైవర్సిటీ పార్క్‌ ఫ్లైఓవర్‌పై స్టే వంటి అనేక విషయాల్లో ప్రభుత్వ నిర్ణయాలను హైకోర్టు కొట్టేసింది.
అయినా తెరాస ప్రభుత్వం కుంభకర్ణ నిద్ర వదిలించుకోవటా నికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించటం లేదు. ఆర్టీసీ సమ్మె విష యంలో ఉద్యోగులతో చర్చలు జరపాలని డైరెక్షన్‌ ఇచ్చినా మొక్కు బడి చర్చలు జరిపి తన ప్రైవేటీకరణ నిర్ణయానికి రాష్ట్ర ప్రభు త్వం కట్టుబడి ఉంది. రెండ్రోజుల నాడు ప్రజలు తమ విధానాలు బలపరుస్తున్నారు కాబట్టే ఉప ఎన్నికతో సహా అన్ని ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజారిటీ సాధించామని, ఆందోళన చేస్తున్న వారికి ప్రజా మద్దతు లేదని వ్యాఖ్యానించారు. పైగా హైకోర్టు తమ నిర్ణయాలను ప్రభావితం చేయలేదని, కావాలంటే సుప్రీం కోర్టు వరకు వివాదాన్ని లాగుతామని కూడా స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్టీసికి రావల్సిన బకాయిల విషయంలో అడ్డగోలు వాదనలు చేస్తున్న అధికారులను కోర్టు మందలించింది. ఈ వ్యవహారాలన్ని గమనిస్తే తెరాస ప్రభుత్వం ఏకంగా హైకో ర్టునే బ్లాక్‌మెయిల్‌ చేస్తుందా అన్న సందేహం కలుగుతోంది.
పై ఉదాహరణలన్నీ విశ్లేషిస్తే కొన్ని విషయాలు స్పష్టమవుతు న్నాయి. ఒకదాని వెంట ఒకటిగా చట్ట వ్యతిరేక నిర్ణయాలు తీసు కుంటున్న రాజ్యాంగేతర శక్తి ఎవరు? హైకోర్టును రాష్ట్ర ప్రభుత్వ మే పదే పదే ధిక్కరిస్తూ ఉంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు, న్యాయ వ్యవస్థ పని తీరుపై ప్రజలు ఏ పాటి నమ్మకంతో ఉంటారు? ప్ర భుత్వం ఏ రాజకీయ ఆర్థిక ప్రయోజనాలు ఆశించి న్యాయవ్యవస్థ ను, సాధారణ పాలనా ప్రమాణాలను ధిక్కరిచంటానికి సిద్ధమవు తోంది? అన్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధనాలు చెప్పాల్సి ఉంది.
చివరిగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగుల సంఖ్య పరంగా మూ డు ప్రధాన శాఖలున్నాయి. ఒకటి ఆర్టీసీ, రెండు విద్యుత్‌ విభా గం, మూడోది ఎన్జీఓలు. ఆర్టీసీ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిరంకుశ వైఖరి కళ్లకు కనిపిస్తూనే ఉంది. ఈ పోరాటంలో ప్రజా ధనంతో రక్తమాంసాలు సమకూర్చుకున్న ఆర్టీసీని కాపాడుకోలేకో పోతే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలు అథ: పాతాళానికి చేరనున్నాయి. ఇప్పటికైనా రాష్ట్రంలోని ఉద్యోగులందరూ జాయింట్‌ యాక్షన్‌ ప్రకటనల పరిధి దాటి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సాటి ఉద్యోగులను కాపాడుకోగలిగితేనే రేపటి రోజున ఇతర విభాగాల ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడకుండా అప్రమత్తంగా ఉంటుంది.

కొండూరి వీరయ్య
సెల్‌ : 9871794037