ఖాతాదారులకు న్యాయం చేస్తాం
ఎస్‌బీఐ ఆర్‌ఎం నాగేశ్వరరావు

పుట్టపర్తి, సెప్టెంబరు 10: నగర పంచాయతీలోని బ్రాహ్మణపల్లి స్టేట్‌బ్యాంకులో జరిగిన నిధుల స్వాహాలో నిజాలు నిగ్గు తేల్చి ఖాతాదారులకు న్యాయం చేస్తామ ని రీజనల్‌ మేనేజర్‌ నాగేశ్వరరావు పేర్కొన్నా రు. మంగళవారం బ్యాంకుకు సెలవైనా డీజీఎం సక్సేనాతో కలిసి, ఆర్‌ఎం బ్యాంకు సిబ్బందితో అంతర్గతంగా విచారణ చేపట్టారు. అనంతరం ఆర్‌ఎం విలేకర్లతో మాట్లాడారు. నిజానిజాలు నిగ్గు తేలుస్తామని, కొంచెం ఆలస్యమైనా ఖాతాదారులకు న్యాయం చేస్తామన్నారు. రమేశ్‌ అనే వ్యక్తి ఏజెన్సీ ద్వారా బ్యాంకులో పనిచేస్తున్నారని, అయితే అతను బ్యాంకు ఉద్యోగి కాదని వివరించారు. ఇంతవరకు రూ.49.31 లక్షలు ని ధులు స్వాహా అయినట్టు తెలిసిందన్నారు. బ్యాంకులో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా విచారణ చేపడుతున్నామని, బ్యాంకు ఉద్యోగులలో సైతం ఎవరు తప్పు చేసినా వదిలేది లేద న్నా రు. పూర్తిస్థాయి విచారణ అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఖాతాదారులకు తప్పక న్యాయం చేస్తామని పేర్కొన్నారు. బ్యాం కు మేనేజర్‌ ఎస్‌ఎన్‌ఎల్‌ చారీ, సిబ్బందిని విచారించారు.

Courtesy Andhrajyothi