* మరో ఇద్దరు మావోయిస్టులు మృతి
ప్రజాశక్తి- విశాఖపట్నం ప్రతినిధి
విశాఖ ఏజెన్సీలో సోమవారం నాడు కూడా మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగాయి. ఈ కాల్పుల్లో మరో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసు అధికారులు ప్రకటించారు. ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. తాజా కాల్పులతో మృతుల సంఖ్య ఐదుగురికి చేరింది. ఆదివారం కాల్పుల్లో తప్పించుకున్న వారి కోసం జరుపుతున్న గాలింపులో భాగంగా గూడెంకొత్తవీధి మండలం గుమ్మిరేవుల పంచాయతీ పేములగొంది వద్ద పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరుపక్షాలు కాల్పులకు దిగినట్లు పోలీసులు తెలిపారు. తాజా కాల్పుల్లో మరణించిన వారిని గుర్తించాల్సిఉంది. ఆదివారం నాడు మరణించిన వారిని వారిలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అజరు, బిమల, బుద్రిగా గుర్తించారు.

Courtesy Prajashakathi..