• ఎస్జీటీ ఫలితాలు వెంటనే వెల్లడించండి..
  • టీఆర్‌టీ-2017 అభ్యర్థుల ఆందోళన
  • ప్రగతి భవన్‌ ముట్టడికి యత్నం.. అరెస్టు

ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ-2017) ద్వారా ఎంపికైన మిగిలిన వారిని కూడా ఉద్యోగాల్లోకి తీసుకోవాలన్నడిమాండ్‌తో అభ్యర్థులు మంగళవారం ప్రగతిభవన్‌ ముట్టడికి యత్నించారు. రోడ్డుపై బైఠాయించిన అభ్యర్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులను అరెస్టు చేసి గోషామహల్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. టీఆర్టీ-2017 ద్వారా ఎంపికైన 8,792 మంది అభ్యర్థుల్లో 2,200 మందికే నియామక పత్రాలు అందజేశారని, మిగిలిన పోస్టులను కూడా భర్తీ చేయాలని కోరారు. ఎస్జీటీ అభ్యర్థుల ఫలితాలు సెప్టెంబరు 30లోపు వెల్లడించాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా టీఎ్‌సపీఎస్సీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉపాధ్యాయ నియామకాల్లో అడ్డంకులన్నింటిని పరిష్కరించి సత్వరమే నియామకాలు చేపట్టాలని టీఆర్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. టీఆర్టీ ద్వారా ఎంపికైన మిగిలిన అభ్యర్థులకు వెంటనే పోస్టింగ్‌ ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. టీఎ్‌సఎంఎ్‌సటీఎఫ్‌ ఆధ్వర్యంలో చేపటిన దీక్షకు హాజరైన ఆయన వారికి మద్దతు తెలిపారు. తమను తక్షణమే పోస్టుల్లో నియమించేందుకు చర్యలు తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ అభ్యర్థులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కు వినతిపత్రం అందజేశారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ చేపడతాం  టీఆర్టీ ఎస్జీటీ ఫలితాలు విడుదల చేసి నియామకాలు చేపట్టాలన్న హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించిన టీఎ్‌సపీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణిని విధుల నుంచి తొలగించాలని టీఆర్టీ-2017 అభ్యర్థులు డిమాండ్‌ చేశారు. లేకుంటే హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహిస్తామని హెచ్చరించారు.

మరింత సమయం కావాలి: టీఎ్‌సపీఎస్సీ ..;టీఆర్టీ ఎస్జీటీ ఫలితాల వెల్లడికి మరింత సమయం పడుతుందని, అభ్యర్థులు వేచి ఉండాలని టీఎ్‌సపీఎస్సీ పేర్కొంది. హైకోర్టు ఆదేశాల మేరకు 3,375 మంది తెలుగు మీడియం అభ్యర్థులకు, 837 మంది ఇంగ్లిషు మీడియం అభ్యర్థులకు రీలింగ్వి్‌షమెంట్‌ (వదులుకోవడం) ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

Courtesy Andhra Jyothy..