– అమరావతి:
ఆర్థికమాంద్యం రాష్ట్రాన్ని వణికిస్తోంది. ఆర్థికశాఖ తాజాగా రూపొందించిన గణాంకాల ప్రకారం అన్ని రంగాలపైనా మాంద్యం ప్రభావం పడింది. అన్ని రకాల పన్నుల వసూళ్లు తగ్గాయి. వాణిజ్య పన్నులతో పాటు,పెట్రోలియం ఉత్పత్తల్లోనూ ఏడు శాతానికి పైగా లోటు నెలకొంది. జిఎస్‌టి కౌన్సిల్‌ ప్రకటిరచిన రక్షిత రెవెన్యూ కన్నా రాష్ట్రం చాలా వెనుకబడింది.
ఈ ఆరు నెలల్లో వసూలు కావల్సిన 11,715 కోట్ల రూపాయలకు గానూ, 10,382 కోట్లు మాత్రమే జిఎస్‌టి పద్దుల్లో ఉన్న పన్నుల ద్వారా లభిరచిందని ఆర్థికశాఖ తేల్చింది. గతంతో పోలిస్తే ఆటోమొబైల్‌ రంగంలో 6.54 శాతం తక్కువ వృద్ధి నమోదైరది. ఇసుము, ఉక్కు విభాగంలో ఏకంగా 17.44 శాతం తక్కువ వృద్ధి నమోదుకాగా, సిమెరట్‌లో కూడా 10 శాతం తక్కువ వృద్ధి కనిపిరచిరది. ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో 27.64 శాతం తక్కువ వృద్ధి నమోదైంది. అతి తక్కువ వృధ్ది నమోదైన వాటిలో ఈ విభాగమే మొదటి స్థానంలో ఉంది.
జిఎస్‌టి పరిధిలోకి రాని పెట్రోలియం ఉత్పత్తుల్లోనూ 25.67 శాతం తక్కువ వృద్ధి నెలకొరది. సేవారంగాన్ని పరిశీలిస్తే వర్క్‌, కాంట్రాక్టులకు సంబంధిరచి 0.63 శాతం, రవాణా రంగంలో 7.23 శాతం తక్కువ వృద్ధి గుర్తిరచారు. ఇక ఇళ్లు, భవనాల అద్దెలు, లీజుల్లో గరిష్టంగా 37.23 శాతం తక్కువ వృద్ధి కనిపిరచడం ఆరదోళన కలిగిరచే పరిణామంగా అధికారులు చెబుతున్నారు. భూముల ద్వారా ఆదాయం ఇప్పటిదాకా ప్రతియేటా పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది మాత్రమే ఈ విభాగంలో ఆదాయం తగ్గుముఖం పట్టింది. ఆటోమొబైల్‌ రంగంలో నెలకొన్న మాంద్యం కారణంగా పెట్రోలియం ఉత్పత్తులపై ప్రభావం పడిరదని, గత ఏడాది లీటర్‌పై రెరడురూపాయలు తగ్గిరచడం కూడా ఆదాయంలో లోటుకు కారణమైరదని అధికారులు విశ్లేషిస్తున్నారు .

17 శాతం లోటులో నిర్మాణ రంగం
భూముల విలువ తగ్గిపోవడం, కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత నిర్మాణ పనులపై విధిరచిన ఆరక్షలు కారణంగా సిమెరట్‌, ఇనుము, ఉక్కు వినియోగం తగ్గి పోయిరది.. అరదుకే 17 శాతానికిపైగా వృద్ధిలో లోటు కనిపిస్తోరదని వారు చెబుతున్నారు. నీటిపారుదల ప్రాజెక్టులు, రాజధానిలో కట్టడాలు, మౌళికాభివృద్ధి పథకాలు ఆగిపోవడమే దీనికి కారణంగా వారు అరగీకరిస్తున్నారు.

నిర్మానుష్యంగా భవనాలు
ఇక కొత్త రాష్ట్రంలో అభివృద్ధి ఉరటురదని అరచనా వేసిన అనేక మంది బిల్డర్లు రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్లు ఖర్చుచేసి పెద్ద పెద్ద భవనాలను నిర్మిరచారు. తొలి రోజుల్లో బాగానే ఉన్నప్పటికీ తరువాత కాలంలో ఆదరణ లేకపోవడంతో వేలాది భవనాలు నిర్మానుష్యంగా మారిపోయాయి. వీటికి కనీస అద్దెలు కూడా రాని పరిస్థితి నెలకొరది. లీజులకు తీసుకునే వారు కూడా లేకపోవడం వల్ల పన్నుల రూపంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం కూడా 37 శాతానికిపైగా పడిపోయినట్లు గుర్తిరచారు.

6శాతం తగ్గిన వాహనాల కొనుగోళ్లు
రవాణా రంగం నష్టాల బాటలో పయని స్తోరది. ప్రధానంగా వాహనాల కొనుగోళ్లు దేశ వ్యాప్తంగా తగ్గిపోయాయి. గత ఏడాదికన్నా ఆరు శాతానికి పైగా కొనుగోళ్లు తగ్గిపోయాయి. దీని ప్రభావం పెట్రో ఉత్పత్తులపై పడిరది. 2018-19 సెప్టెరబర్‌ వరకు 20.67 లక్షల కిలోలీటర్ల డీజిల్‌ అమ్మకాలు జరగ్గా, ఈ ఏడాది సెప్టెరబర్‌ వరకు 20.11 లక్షల కిలోలీటర్ల అమ్మకాలే జరిగాయి. రవాణా, నిర్మాణరంగంలో వెనకడుగు కూడా డీజిల్‌ వినియోగరపై ప్రభావం చూపిరచినట్లు అధికారులు విశ్లేషిస్తున్నారు.

Courtesy Prajashakti