యధారాజా తధా ప్రభుత్వం అన్నట్టు ఎవరైతే సెక్రటేరియట్ కి కూడా రాకుండా దొరగడీల పాలన చేస్తున్నాడో అటువంటి సీఎం కేసీఆర్ పాలనలో తెరాసా  ప్రభుత్వం కూడా అలగే సాగుతోంది. ఆనాడు ఆయన దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తా అన్నాడు. ఇవ్వలేదు. ఐదేళ్ల తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి పదవి ఆయనే చేపట్టి, కుటుంబపాలన కొనసాగిస్తూ దళితులను దగా చేసిన దళిత వ్యతిరేకిగా వ్యవహరిస్తున్నాడు. రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచిన ఆర్టికల్ 3 ప్రకారం, తెలంగాణ వచ్చిందని స్వయంగా సీఎం కె.సి.ఆరే అనేక సార్లు మాట్లాడాడు. అందుకు కృతజ్ఞతగా అంబేద్కర్ కి 125 అడుగుల విగ్రహం నిర్మిస్తానని మాయమాటలు చెప్పాడేగాని నిర్మించలేదు.

Ambedkar 128 birth Anniversary -2019ఈ ఐదేళ్లలో కనీసం ట్యాంక్ బ్యాండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడానికి ఒక్కసారికూడా రాలేదు. ఇందుకు నిరసనగా అనేక చౌరస్తాలలో అంబేద్కర్ విగ్రహాల్ని నెలకొల్పే పనిలో భాగంగా పంజాగుట్ట చౌరస్తాలో విగ్రహాన్ని నెలకొల్పిన అంబేద్కర్ వాదుల్ని అరెస్ట్ చేసి, ఆ విగ్రహాన్ని ధ్వంసంచేసి, అత్యంత అవమానకరంగా చెత్తబండిలో డంప్ యార్డ్ కి తరలించారు. ఇలాంటి అంబేద్కర్ వ్యతిరేక, దళిత వ్యతిరేక విద్వేష చర్యకి పాల్పడే ధైర్యం పొలిసు, మున్సిపల్ అధికారులకు వచ్చిందంటే అది సీయం ఇచ్చిన అలుసే. ఈ వైఖరి యధా రాజా తధా ప్రభుత్వం అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నది. ఈ అగ్రకుల దురహంకార వైఖరిని బహుజన ప్రతిఘటన వేదిక (బి.ఆర్.ఎఫ్) తీవ్రంగా ఖండిస్తున్నది. విగ్రహాన్ని తరలించి, ధ్వంసంచేసి అవమానించిన అధికారులపై వెంటనే ఎస్సీ-ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. కమీషన్ల పేరిట కాలయాపన ఎత్తుగడలను కట్టిపెట్టాలి. కె.సి.ఆర్ పాలనలో జరిగిన ఈ అవమానానికి ప్రభుత్వమే సంజాయిషి చెప్పాలి…

బి.ఆర్.ఎఫ్, రాష్ట్ర కోఆర్దినేటర్ – ఉ.సా, అంబేద్కర్ యువజన సంఘం నేత – రాజారాం, ఎం.బి.సి నేత – దుర్గ రావు, తదితరులు…