సార్వత్రిక ఓటుహక్కు ప్రదాత – డా. అంబేద్కర్

  – గౌతమ్ భాటియా

ప్రజాస్వామిక పౌరసత్వానికి ఓటుహక్కు అనేది అత్యంత మౌలికమైన అవసరం. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామిక పరిణామక్రమంలో సార్వత్రిక ఓటుహక్కు ప్రజలకు అంత సులభంగా లభించలేదు. సామాన్యులు ఓటు అనే ఆయుధాన్ని తమకు వ్యతిరేకంగా వినియోగిస్తారని ఉన్నత వర్గాలు భావించేవి. సార్వత్రిక ఓటుహక్కు రాకుండా అడ్డుకునేవి ప్రపంచంలోని అనేక దేశాలలో తొలిదశలో స్త్రీలు, ఆస్తిలేనివారు, జాతి పరమైన మైనార్టీలకు ఓటుహక్కు నిరాకరించబడింది. “ధరైట్ టు ఓట్” గ్రంథంలో చరిత్రకారుడు అలెగ్జేoడర్ కెస్స్ఆర్ పేర్కొన్నట్లు అమెరికాలో సార్వత్రిక ఓటుహక్కు అంచలంచలుగా అనేక ఉద్యమాల అనంతరం గాని ప్రజలకు లభించలేదు. ఇతర పాశ్చాత్య ప్రజాస్వామ్యాలలోను ఇదే పరిస్థితి.

భారతదేశంలో మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. మన రాజ్యాంగం ఎకాఎకిన ప్రజలకు సార్వత్రిక ఓటుహక్కు కల్ఫించింది. వలస పాలకుల హయంలో సుమారు 15% మందికి మాత్రమే ఓటుహక్కు ఉండేది. పేదరికం, నిరక్ష్యరాస్యత, కులం, వర్గం, లింగ అసమానత గల సమాజంలో రాజ్యాంగ రచయితలు ఇలాంటి నిర్ణయం చేయటం ఎంతో పురోగామి చర్య. బ్రిటిష్ పాలకులు అప్పటిదాకా భారతీయులకు స్వయంపాలన చేతకాదని అవహేళన చేస్తుండేవారు. అలాంటిది స్వరాజ్యం సిద్దించాక వెనువెంటనే ఇటువంటి నిర్ణయం చేయటం గొప్ప విశేషం.

ప్రపంచంలోని ఇతర ప్రజాస్వామ్యలకు భిన్నంగా ఇలా జరగటానికి కారణం ఏమిటి. కాంగ్రెస్ జాతీయఉద్యమ కాలంలో సార్వత్రిక ఓటుహక్కు కొరకు వాగ్దానం చేయబడింది. వయోజనులందరికీ ఓటుహక్కు కల్పించే భాద్యత రాజ్యాంగ రచనసంఘం అద్యక్షుడు డా.. అంబేద్కర్ పైన పడింది.

తన రాజకీయ జీవిత తొలిదశలోనే అంబేద్కర్ ఓటుహక్కు ప్రాధాన్యతను గుర్తించారు. 1919లో సౌత్ బోరో కమిటీకి సమర్పించిన వినతిపత్రంలో బాబాసాహెబ్ ఇలా పేర్కొన్నాడు. “ప్రాతినిధ్య హక్కు, రాజ్యాంగపదవిని పొందే హక్కు పౌరహక్కుల్లో అత్యంత కీలకమైనవి.” ఈ విషయమై అంబేద్కర్ వాదన రెండు రకాలుగా ఉండింది. పౌరసత్వానికి, రాజకీయాలలో సభ్యత్వానికి ఓటుహక్కు అనేది ఎంతో కీలక, నైతిక అవసరం. అంటారనివారికి ఓటుహక్కు రాజకీయ చైతన్యాన్ని కలిగిస్తుంది. ఇన్ని సంవత్సరాలుగా సామాజిక, రాజకీయ జీవితానికి నోచుకోనివారి విముక్తికి ఇది ఆయుధంగా ఉపయోగపడుతుంది. అంబేద్కర్ పేర్కొన్న ఈ రెండు అంశాలు భారత రాజ్యాంగం ఇచ్చిన సార్వత్రిక ఓటుహక్కుకు వెన్నుముక వంటివి. రాజ్యాంగంలో అర్టికర్ 326ను అంబేద్కరే ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ప్రజలందరికి వర్గ, లింగ, కుల, జాతి విభేదాలకు అతీతంగా ఓటుహక్కు లభిస్తుంది. అలాగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా కేవలం వయస్సు, మానసిక స్థితివంటి కొన్ని పరిమితులనే పెట్టి, అందరికి ఆఅవకాశం దక్కేలా చేసింది ఈ ప్రకటననే. అంటే పోటీ చేసేందుకు కులం, సంపద, లింగం వంటి వివక్షలు ఏవి ఉండవన్నమాట. బ్రిటిష్ హయంలో ఆస్తి ఉన్నవారికే ఈ అవకాశం ఉండేదన్నది తెలిసిన విషయమే.

హెచ్ వి కామత్ వంటి వారు సార్వత్రిక ఓటుహక్కును వ్యతిరేకించారు. ఇంతటి నిరక్ష్యరాష్యత ఉన్న దేశంలో అందరికి ఓటుహక్కు ఇవ్వటం ప్రమాదకరమని వారు వాదించారు. అంబేద్కర్ వంటి వారు ఈ విమర్శలని తీవ్రంగా ఖండించారు.

  రచయిత న్యాయవాది, గ్రంథ రచయిత(మింట్ సౌజన్యంతో)

అనువాదం: బి. భాస్కర్, సీనియర్ జర్నలిస్టు