దేశంలో విమానాలు ఈ నెల 25 నుంచి ఎగరనున్నాయి. కరోనా కట్టడిలో భాగంగా కేంద్రప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఆగిపోయిన దేశీయ విమానాల కార్యకలాపాలు రెండు నెలల తరువాత ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు బుధవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. దేశీయ విమానయాన కార్యకలాపాలు మే 25 (సోమవారం) నుండి క్రమాంకనం చేసిన పద్ధతిలో తిరిగి ప్రారంభమవుతాయని తెలిపారు.

Courtesy Nava Telangana