– ప్రభుత్వ స్థలంలో గుడిసెలు
– అడ్డుకున్న పోలీసులు.. కలెక్టర్‌కు విన్నపం

కొత్తగూడెం : ఎన్నికల ప్రతిసారీ ఆదివాసీల ఇండ్ల స్థలాలపై నాయకులు ఇచ్చిన హామీలు ఏండ్ల తరబడి ఆచరణకు నోచుకోకపోవడంతో వారే కదనరంగంలోకి దిగారు. గూడు కోసం గురువారం పోరుబాట పట్టారు. ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈఘటన భద్రాద్రి జిల్లా చుంచుపల్లి మండలంలో జరిగింది. ప్రశాంతినగర్‌ పంచాయతీ గరిమెళ్లపాడుకు చెందిన ఆదివాసీలు 40 ఏండ్లుగా అక్కడే ఉంటున్నారు. వీరికి ఇండ్ల స్థలాలు కానీ, ఇండ్లు కానీ లేవు.

అనేక పర్యాయాలు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ స్థలాలు చూపలేదు. ఎన్నికల సమయంలో నాయకులు ఇచ్చిన హామీలు అమలు కాలేదు. దీంతో స్థానికంగా ఉన్న ఖాళీ ప్రభుత్వ స్థలంలో గురువారం గుడిసెలు వేసేందు కు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న 2 టౌన్‌ పోలీసులు అక్కడికి చేరుకుని ఆదివాసులను అడ్డు కున్నారు. దాంతో కొత్తగూడెం మున్సిపల్‌ కార్యాల యానికి జిల్లా కలెక్టర్‌ వస్తున్నారన్న సమా చారం తెలుసుకున్న ఆదివాసీలు అక్కడికి వెళ్లారు. కలెక్టర్‌ ఎంవీ రెడ్డిని కలిసి తమ సమస్యను తెలిపారు. ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకునేందుకు అను మతివ్వాలని కోరారు. త్వరలోనే సమస్యను పరిష్కరి స్తామని కలెక్టర్‌ హామీ ఇవ్వడంతో వెనుదిరిగారు.

Courtesy Nava Telangana