Image result for chapak movie"‘పద్మావత్‌’ తర్వాత బాలీవుడ్‌ తార దీపికా పదుకొనె నటించిన చిత్రం ‘చపాక్‌’. యాసిడ్‌దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ఇది. ‘రాజీ’ ఫేం మేఘనా గుల్జార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఫస్ట్‌లుక్‌తోనే అనేక మంది ప్రశంసలు పొందిన ఈ చిత్రం ట్రైలర్‌ మంగళవారం విడుదల చేశారు. సోషల్‌ మీడియాలో ఈ ట్రైలర్‌కు విశేష స్పందన వస్తోంది. ముఖ్య పాత్రలు పోషించిన దీపికా పదుకొనే, విక్రాంత్‌ మాస్సే అద్భుతమైన నటనకు గానూ ప్రశంసలు అందుకుంటున్నారు.

‘వీ వాంట్‌ జస్టీస్‌..వీవాంట్‌ జస్టీస్‌..’ అని యువత ఆందోళన చేస్తున్న డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభం అవుతుంది. ఒక యువకుడు అందమైన దీపిక (మాలతి) ముఖంపై యాసిడ్‌ చల్లడంతో మొదట ఆమె మానసికంగా కుంగిపోతుంది. న్యాయం కోసం ఆమె చేసిన పోరాటాలు స్ఫూర్తిని నింపుతాయి. ‘ యాసిడ్‌ అమ్మడం ఆపేస్తే ఎంత బాగుంటుంది.. దొరకుండా ఉంటే… వేసే వాడే కాదు…’ అంటూ ఆమె ఆవేదన చెందడం. ‘అతడు నా ముఖాన్ని నాశనం చేశాడు.. నా ఆత్మవిశ్వాసాన్ని కాదు..’ అని దీపిక చివర్లో చెప్పడం హైలెట్‌గా నిలిచింది. నిజ జీవిత సంఘటలనతో చిత్రీకరించిన ‘ఛపాక్‌’ 2020 జనవరి 10న విడుదల కాబోతోంది.

(Courtesy Prajashakti)