– ఎస్‌.పుణ్యవతి

ఆగస్టు 15, జనవరి 26 ‘జైహింద్‌’ నినాదాలతో మారుమోగుతాయి. జనగణమన ఆలపిస్తూ ‘జయ జయ జయ జయహే! జైహింద్‌’ అని అందరూ అటెన్షన్‌లో నిలబడి అశోకుని ధర్మ చక్రంతో కూడిన మువ్వన్నెల జెండాకు సెల్యూట్‌ చేసిన విద్యార్థి దశ తీపి గుర్తులు మర్చిపోలేం! మోడీజీ పెద్ద చదువులే చదివారని పత్రికల భోగట్టా. సర్టిఫికెట్లు ఉన్నాయో లేదో తెలియదు గాని విద్యార్థి దశలో జాతీయ జెండాకు వందనం చేసుంటే… జైహింద్‌ నినాదం ఇచ్చి వుంటే… వాటి స్ఫూర్తిని మనసులో నింపుకొని వుంటే ప్రస్తుత దేశ పరిస్థితి, దేశ రాజకీయాలు మరోలా ఉండేవేమో.

జాతీయ జెండా, జైహింద్‌ నినాదాలు భారతదేశ ప్రజల జీవితాలతో పెనవేసు కున్నాయి. కులం, మతం తారతమ్యం లేకుండా ప్రజల్లో దేశభక్తిని పురికొల్పుతా యి. సర్వసత్తాక సార్వభౌమత్వానికి, ప్రజల మధ్య ఐక్యతకు చిహ్నంగా నిలుస్తాయి. జాతీయ పర్వదినాల్లో సైనిక వందనాలు, శాంతి భద్రతలు కాపాడే పోలీసు బలగా ల వందనాలు స్వీకరించే ప్రధానమంత్రి, హోమ్‌ మంత్రులు వాటి చరిత్ర రూపొంది న తీరు కొంచెం తెలుసుకోవడం అవసరం. ‘జైహింద్‌’ నినాదం వినగానే మన మన సుల్లో మెదిలే చిత్రం సైనిక వందనం చేస్తున్న నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌. ఆ నినా దం ఇచ్చింది ఆ మహనీయుడే అనుకుంటాం. కానీ ఆయన ఆజ్ఞల మేరకు ఆయన సారథ్యంలో నడిచిన అబిద్‌ హసన్‌ మొదట ఆ నినాదాన్ని రూపొందించాడు.

ఎవరీ అబిద్‌ హసన్‌?
అబిద్‌ హసన్‌ హైదరాబాదు నివాసి. ఐఎఫ్‌ఎస్‌ అధికారి. నరేంద్ర లూధర్‌ వ్యాసాల్లో సేకరించిన సాక్ష్యాల వల్ల అబిద్‌ హసన్‌ తల్లి ఫర్‌క్రుల్‌ హైజా దేశభక్తురాలు. బ్రిటిషు వ్యతిరేకి. అబిద్‌హాసన్‌ ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకున్నాడు. తల్లి బ్రిటిషు వ్యతిరేకత ఆయనపై ప్రభావం చూపింది. అందువల్ల, తోటి వారు పై చదువుల కోసం ఇంగ్లండు వెళ్లినా, ఆయన మాత్రం ఇంజనీరింగు చదవడం కోసం జర్మనీ వెళ్లాడు. అక్కడే నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌ని కలుసుకున్నాడు. నేతాజీ ప్రోత్సాహంతో ఇంజనీరింగు చదువుకు సలాంగొట్టి దేశ స్వాతంత్య్ర పోరా టానికి ఉరికాడు. నేతాజీ స్థాపించిన ‘ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌’లో చేరాడు. దాదాపు నేతాజీ కుడి భుజంగా పని చేశాడు. ‘ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌’లో పలు మతాలు, కులాల వారుచేరారు. రాజపుత్రులు, బలూచీలు, సిక్కులు, ముసల్మానులు వగైరా. వారు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు పరస్పర గౌరవ సూచకంగా వారి వారి మత సాం ప్రదాయం ప్రకారం హిందువులైతే ‘జై రామ్‌జీకీ’ అని, ముసల్మానులయితే ‘సలాం అలైకుం’ అనీ, సిక్కులైతే ‘సత్‌శ్రీ అకాల్‌’ అనీ పలకరించుకొనేవారు. అయితే ఇలా మత సాంప్రదాయాల ప్రాతిపదికన గౌరవించుకోవడం సరికాదని, నేతాజీ స్థాపించిన ‘ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌’ దేశ ఐక్యతకు, సమగ్రతకు చిహ్నంగా ఉండాలనీ అందరినీ ఐక్యం చేసే నినాదం అవసరమని నేతాజీ భావించాడు. తన సహచరుడు అబిద్‌ హసన్‌కి సరైన నినాదం రూపొందించే బాధ్యత అప్పగించాడు. ఇద్దరు రాజపుత్ర సైనికులు ‘జై రామ్‌ జీకీ’ అనడం విన్న అబిద్‌ హసన్‌ ‘జై హిం దూస్తాన్‌’ నినాదం సరైనదని భావించాడు. ‘జై హిందూస్తాన్‌’ పెద్దదిగా ఉన్నదని ‘జైహింద్‌’ నినాదం ఖరారు చేశాడు. అదే ‘ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌’ నినాదంగా మారింది. అదే దేశ ప్రజల స్వాతంత్య్ర కాంక్షకు, ప్రజల ఐక్యతకు చిహ్నంగా నిలిచింది. కుల మతాలకతీతంగా కలిసి జీవించాలన్న సందేశాన్నిచ్చింది. అబిద్‌ హసన్‌ తదనంతర కాలంలో తన పేరులో కాషాయ రంగు కలిసేలా సమైక్యతా చిహ్నంగా ‘అబిద్‌ హసన్‌ సఫ్రానీ’గా పేరు మార్చుకున్నాడు. అయితే, దేశాన్ని ఏలుతున్న మోడీ-షా ద్వయానికి ఈ చరి త్ర, ‘జైహింద్‌’ నినాదం ఇచ్చిన స్ఫూర్తి అర్థమైనట్టు లేదు. ఉంటే మనకీ పాట్లు వచ్చే వి కావు. మన జాతీయ జెండా రూపొందించిన తీరు కూడా తెలుసుకుందాం. జాతీ య జెండా రూపకల్పనలో నలుగురు స్త్రీమూర్తులు ఉన్నారని ఎందరికి తెలుసు? వారే సిస్టరు నివేదిత, డా||అనిబిసెంట్‌, మేడం భికాజీ కామా, సూరయ్యి బద్రుద్దీన్‌ త్యాబ్జీ. మనకి మన పింగళి వెంకయ్య తయారు చేసిన జెండా మాత్రమే తెలుసు. కానీ 1904 నుంచి 1947 వరకు జాతీయ జెండా రూపకల్పనలో పలు దశలున్నాయి.
1904లో మొదటిసారి స్వామీ వివేకానంద శిష్యురాలైన సిస్టర్‌ నివేదిత ఎరు పు, పసుపు రంగులతో కూడిన జెండాను రూపొందించారు. జెండాపై వందే మాతరం నినాదముండేది. 1906లో కోల్‌కతాలో ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రం గులలో ఉన్న జెండాను సురేంద్రనాథ్‌బెనర్జీ ఎగరేశారని అంటారు. 1907లో పార్సీ మహిళ మేడం భికాజీ రుస్తుం కామా కాషాయం, పసుపు, ఆకుపచ్చ రంగులతో ఉన్న జెండాను తయారు చేశారు. అదే జర్మనీలోని స్టట్‌గార్ట్‌లో, రెండో సోషలిస్టు ఇంటర్నేషనల్‌ కాంగ్రెసు సందర్భంగా ఆవిష్కరించారు. 1917లో బాలగంగాధర తిలక్‌, అనిబిసెంట్‌లు ఒక జెండా తయారు చేశారు. నేతాజీ స్థాపించిన ‘ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌’ పతాకంలో మువ్వన్నెల మధ్య పులి గుర్తు ఉంటుంది. ఇక మన పింగళి వెంకయ్య.. గాంధీజీ సలహా మేరకు ఎరుపు, ఆకుపచ్చ రంగులలో ఉన్న జెండాను తయారు చేశారట. ఎరుపు, ఆకుపచ్చ రంగులు హిందూ, ముస్లిం మతస్తులకు ప్రాతినిధ్యం వహిస్తాయని, ఇతర మతస్తుల కోసం తెలుపును గాంధీజీయే చేర్చారని తెలుస్తోంది. మొత్తం మీద 1931లో ప్రస్తుత పాకిస్థాన్‌లోని కరాచీలో జరిగిన ఆలిండియా కాంగ్రెసు కమిటీ ఆమోదించిన జెండాలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల జెండా మధ్యలో రాట్నం గుర్తు ఉంటుంది.

జెండాలో ధర్మ చక్రం ఎలా వచ్చింది?
స్వతంత్ర భారత్‌ ప్రజల సేవలకు చిహ్నంగా తన స్వంత జెండా అవసరమని భావించి ‘రాజ్యాంగ సభ’ బాబూ రాజేంద్రప్రసాద్‌ అధ్యక్షతన 1947 జూన్‌ 23న ఒక కమిటీ వేసింది. జులై 14న కొన్ని తర్జనభర్జనలు జరిగాయి. బద్రుద్దీన్‌ త్యాబీ ్జ-సూరయ్యాలు కూడా తమ వాణి వినిపించారని అంటారు. బద్రుద్దీన్‌ ఐసీఎస్‌ అధికారి. రాజ్యాంగ సభ డిప్యూటీ సెక్రటరీగా పని చేశారు. సూరయ్యి ఆయన భార్య. హైదరాబాద్‌ వాసి. వీరిద్దరూ జాతీయ కాంగ్రెసు సభ్యులే. స్వాతంత్రోద్యమ కాంక్షకు నిదర్శనంగా ఉన్న కాషాయం, తెలుపు,ఆకుపచ్చ రంగులతో ఉన్న మూడు రంగుల జెండా ఉండాలని, రాట్నం బదులుగా అందరికీ ఆమోదయోగ్యంగా బుద్ధుని బోధనలైన సత్యం, ధర్మం, న్యాయం ప్రబోధించే అశోకుని ధర్మ చక్రం అన్ని విధాల యోగ్యమని ఆమె చెప్పారని అంటారు. ఈ విషయం బాబూ రాజేంద్రప్రసాద్‌, గాంధీజీలకు విన్నవించారు. వారి ఆమోదంతో జులై 17న బద్రుద్దీన్‌ ఢిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌కి వెళ్లి గుడ్డ కొని సూరయ్యా (ఆమె ఆర్టిస్టు కూడా)తో కలిసి జెండా తయారు చేశారు. దీనికి జులై 22న రాజ్యాంగ సభ ఆమోదం తెలిపింది. బద్రుద్దీన్‌ తన 84వ ఏట 1996లో ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు తెలిపారు. ఆవిధంగా జెండా రూపకల్పనలోనే ఎందరో మహనీయుల మేధస్సు, సర్వ జనుల సమానత్వం, సమ ధర్మం, సమ న్యాయం, స్వతంత్ర భారత ప్రజల ఆకాంక్షలు వ్యక్తమయ్యాయి.

పిదప కాలం పిదప బుద్ధులు
72 సంవత్సరాల తరువాత మోడీ-షా జోడీ మతం పేరుతో భారత ప్రజల పౌరసత్వ హక్కులపైనే పాము పడగ విప్పింది. జాతీయ పౌర పట్టిక, జాతీయ జనాభా పట్టిక, పౌరసత్వ సవరణ చట్టం పేరుతో అసలు చదువే రాని మూడో వంతు జనాలున్న ఈ దేశ ప్రజలను, వారి జీవితాలను కకావికలు చేస్తోంది. ‘నువ్వు ఈ దేశంలోనే పుట్టావన్న దానికి దాఖలా ఏంటి? రుజువు చేసుకో! లేకుంటే డిటెన్ష ను క్యాంపులో మగ్గిపో’ అంటూ హూంకరిస్తున్నారు. జన్మ దినం, జన్మ స్థలం రుజు వుల కోసం కాగితాల కోసం పరుగులు పెట్టిస్తున్నారు. పోగాలం దాపురిస్తే అంతే! జనం ఎన్నాళ్లు భరిస్తారు? తిరగబడతారు. వరి గడ్డి వాము లోపల్లోపల కుమిలి ఎలా భగ్గుమంటుందో దేశం కూడా అలాగే వుంది. నిన్న రాత్రి షషీన్‌బాగ్‌ వెళ్లాను. ‘చదువుకోరా కొడుకా అంటే, ఈ దేశం నాది కానప్పుడు చదివి ఏం చెయ్యనమ్మా?’ అని అడిగిన ప్రశ్నకు నేనేం జవాబు చెప్పను అని ప్రశ్నించిన ఆ తల్లికి మనమేం జవాబు చెప్పాలి? అశేష త్యాగాలు చేసి స్వాతంత్య్రం సాధించింది ఇందుకా! దేశ స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణత్యాగం చేసిన రాంప్రసాద్‌ బిస్మిల్‌, అష్పఖుల్లా ఖాన్‌లు మనకు ఆదర్శం కావాలి. దేశ స్వాతంత్య్ర పోరాటంలో ముస్లిం సోదరీ సో దరుల త్యాగాలు తెలియకపోతే పోయి ఇండియా గేటుపై వున్న పేర్లు చదువుకో మని మోడీ షా జోడీని అడుగుదాం. దేశ సంపదల వృద్ధిలో దళితులు, మైనారిటీ లు, బలహీన వర్గాల శ్రమ, చెమట చుక్కలు లెక్కగట్టమని అడుగుదాం. చెమటతో తడిసిన మట్టి నడగండి కాగితాలు. నుజ్జు చేసిన యంత్రాల నడగండి కాగితాలు. ఆకాశ హర్మ్యాల నిర్మాణంలో కూలిన శరీరాల నడగండి కాగితాలు. ప్రాజెక్టు నిర్మాణలో కొట్టుకుపోయిన జీవితాల నడగండి కాగితాలు. ‘మీ అమ్మ, నాన్న పుట్టింది ఎక్కడీ’ అని అడిగితే ‘చచ్చి స్వర్గంలో ఉన్న వాళ్లని పోయి అడుక్కో’ అని జవాబు చెప్దాం.