వాసిలి సురేష్‌

ప్రపంచమంతా మహిళాదినోత్సవ సంబరాల్లో మునిగి తేలుతుంటే మెక్సికోలో మాత్రం మహిళలు ఎవరూ, ఎక్కడా కనిపించకుండా పోయారు. బడుల్లో, కాలేజీల్లో, షాపింగ్‌ మాల్స్‌లో ఎక్కడా వారి జాడలేదు. ఆ దేశంలో ఆ రోజు మహిళలే లేరా అన్నట్టుగా తమారైంది పరిస్థితి. ఆ రోజు వారంతా ఏమయ్యారనేది ఆసక్తి కలిగించే విషయమే కాదు, గొప్ప ఆలోచనలు రగిలించిన సందర్భం..! వాళ్లంతా ఆ రోజు ఏమయ్యారంటే…
హింస, అత్యాచారాలకు గురవుతున్న మహిళల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. ఏటా ఎంతో మంది మహిళలు అదశ్యమవు తున్నారు. వాళ్ల జాడే తెలియడం లేదు.

చారిత్రాత్మకంగా, మెక్సికోలో మహిళలపై హింస ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది. కానీ గత రెండు సంవత్సరాలలో ఈ నేరాల సంఖ్య మరింతగా పెరిగింది. మెక్సికో సెక్రటరీ జనరల్‌ ఆఫ్‌ నేషనల్‌ పబ్లిక్‌ సెక్యూరిటీ ప్రకారం, 2019 జనవరి నుంచి సెప్టెంబర్‌ వరకు 2,833 మంది మహిళలు మరణించారు. ఈ సంఖ్యలో 25.6 శాతం మందివి మాత్రమే ద్వేష పూరిత నేరాలుగా, మిగిలి నవి నరహత్యలుగా నమోదు చేయ బడ్డాయి. దీన్ని బట్టి మెక్సికో స్త్రీల మనుగడ ఎంత ప్రమాద కరంగా మారిందో అర్థం చేసుకోవాలి. అందుకే ఆడవారి మీద రోజు రోజుకూ పెరిగిపోతున్న హింసకు వ్యతిరేకంగా తమ నిరసనను వినూత్నంగా తెలియజేయడం కోసం మెక్సికన్‌ మహిళలు. మార్చి తొమ్మిదిన ఇల్లు దాటి బయటకు వెళ్లకూడదని, విధులకు హాజరు కాకూడ దని నిర్ణయించుకు న్నారు. స్కూళ్లకు వెళ్లొద్దని విద్యార్థినులకు పిలుపు నిచ్చారు. షాపులకు సెలవు ఇమ్మన్నారు. ఆ రోజంతా మహిళలు ఎక్కడా కనిపించకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు. ఆకాశంలో సగంలేని సమాజం ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించారు. స్త్రీవాదులు, ప్రముఖులు, సామాజిక కార్యకర్తల నుంచి సామాన్యుల వరకూ అందరి నోటా ఇప్పుడు ఈ నిరసన పెద్ద చర్చనీయాంశమైంది. సాధారణంగా సభలు, సమావేశాలు నిర్వహించడం, దీక్షలో కూర్చోవడం ద్వారా నిరసనలు తెలియ జేస్తుంటారు. కానీ ఇలా రోజంతా కనిపించకుండా ఉండాలనే వినూత్న నిరసనతో ప్రపంచాన్ని ఆలోచింప జేశారు. ఈ నిరసనలో ఉద్యోగినులు విధులకు హాజరు కాకుండా ఇంట్లోనే ఉండిపోయారు. ఇంట్లో ఉండే గహిణులు ఇంటి పనులేమీ చేయకుండా దీనికి తమ మద్దతును తెలియ జేశారు. మూడు లక్షల ఇరవైవేలకు పైగా సభ్యులున్న ‘ఎ డే వితౌట్‌ ఉమెన్‌’ అనే ఫేస్‌బుక్‌ గ్రూప్‌ ద్వారా రోజంతా మహిళలెవరూ కనిపించకుండా ఉండాలనే విషయం మీద చర్చ జరిపి, ఈ విషయాన్ని అందరికీ తెలియజేశారు. గతంలో ఇదే గ్రూప్‌ సభ్యులు మహిళల అదశ్యానికి వ్యతిరేకంగా రహదారులపై తమ ఎర్రని పాదరక్షలని ఉంచి నిరసన తెలియజేశారు. ఇప్పుడు ‘ఎ డే వితౌట్‌ ఉమెన్‌’ పేరుతో తమ నిరసనోద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోయారు.

ఈ ఉద్యమ నేపథ్యం గమనిస్తే కారణాలు ఈ విధంగా ఉన్నాయి. అవి ఏమిటంటే? పరిమితికి మించి ప్రైవేట ీకరణ, ప్రభుత్వాలు అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలు, అన్నీ రంగాలు కార్పొరేటీకరణ జరగడం వల్ల ధరల నియం త్రణపై ప్రభుత్వాలు పట్టుకోల్పో వడం, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడం జరిగింది. ఆయా కారణాల వల్ల సమాజంలో అసమానతలు క్రమేపీ పెరు గుతూ వచ్చాయి. అందులో స్త్రీ పురుష అసమానతలు మహిళ లకు నరకప్రాయంగా మా రాయి. ఎంతగా అంటే.. స్త్రీలపై ద్వేషం పెంచుకున్న వారు, అభివద్ధి చెందిన వారిపై ద్వేషం అసూయ పెంచుకున్న వారు దాడులకు తెగ బడుతున్నారు. జాతి వివక్ష, లింగ వివక్ష పెరగడం వల్ల అన్యాయంగా డబ్బు కోసం, లైంగిక అవసరాల కోసం మహిళలపైన, చిన్నారులపై దాడులకు పాల్పడటం మెక్సికోలో నిత్యకృత్యమైంది. వీటిని నియంత్రించడం కోసం, మహిళల అవసరం ప్రజలకు తెలియజేయడం కోసం ఈ వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టారు. ‘ఎ డే వితౌట్‌ ఉమెన్‌’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అనూహ్యమైన స్పందన లభించింది. లక్షలాది మంది మహిళలు స్వచ్ఛందంగా ఇందులో పాల్గొన్నారు. తమ ప్రభుత్వాన్ని, దేశ ప్రజలను ఆలోచింపజేశారు. సమస్య తీవ్రతను ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. తమ ఉద్యమ స్ఫూర్తిని ఎల్లలు దాటించి మరికొన్ని దేశాల్లో ఈ ఉద్యమాన్ని తీసుకురాగలిగారు. అయితే భారతదేశంలో ఇప్పటికీ మహిళా భద్రత కోసం నిర్భయ, దిశ లాంటి చట్టాలు తెచ్చినా పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు మహిళలకు రక్షణ కల్పించలేక పోతున్నాయి. మనదేశంలో డిగ్నిటీ మార్చ్‌ పేరుతో మహిళలు తమపై జరుగుతున్న లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడారు. మీటూ, కాస్ట్‌ కౌచింగ్‌ వంటి వాటి గురించీ తమపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించీ భారతీయ మహిళలు గొంతు వినిపిస్తు న్నప్పటికి, అవి అభిప్రాయాలను తెలిపేందుకే దోహదపడ్డాయి గాని సమస్యల పరిష్కారం కోసం ఉపయోగప డలేదు. కాబట్టి నేటి భారతీయ మహిళలు ”ఎ డే విత్‌ అవుట్‌ ఉమన్‌” లాంటి మహిళా ఉద్యమాల స్ఫూర్తితో తమపై జరుగుతున్న దాడులకు, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడాలి. వారికి పౌరసమాజం అండగా నిలవాలి.

Courtesy Nava Telangana