మీరట్‌ : 8నెలలు నిండిన గర్భిణి. సహరన్‌పుర్‌లో ఒక పరిశ్రమలో ఆమె భర్త పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా పరిశ్రమ యజమాని భర్త ఉద్యోగాన్ని తొలగించి, పనిచేసిన నెలకు జీతం ఇవ్వకుండానే.. వారికి ఇచ్చిన గది నుంచి బయటికి గెంటేశాడు. దీంతో.. ఆ దంపతులిద్దరూ 191 కిలోమీటర్ల దూరంలో ఉన్న బులంద్‌షహర్‌లోని స్వగ్రామానికి నడక మొదలుపెట్టారు. సుమారు 100కి.మీ. ప్రయాణం చేసి మీరట్‌ చేరుకున్న తర్వాత వారి అవస్థలు చూసిన స్థానికులు ఆహారాన్ని, ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం పోలీసుల సాయంతో వాళ్ల ఊరికి చేర్చారు.

Courtesy Andhrajyothi