– ఏటీఎం నగదు ఉపసంహరణల్లో పతనం
– డిజిటల్‌ చెల్లింపుల్లోనూ 46 శాతం క్షీణత

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ను నియం త్రించడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన లాక్‌డౌన్‌ వల్ల ప్రజల ఆదాయం అమాంతం పడిపోయిందని ఆర్బీఐ గణంకాలు స్పష్టం చేశాయి. ప్రజల డిజి టల్‌ చెల్లింపుల్లో భారీగా క్షీణత చోటు చేసుకోవడం, ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలు సగం మేర
క్షీణించాయి. ప్రస్తుత ఏడాది ఏప్రిల్‌లో ఎటిఎంల నుంచి నగదు ఉపసంహరణ సగానికి పైగా తగ్గి..రూ.1.27లక్షల కోట్లకు పడిపోయా యని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్వయంగా వెల్లడించింది.

మరోవైపు డిజిటల్‌ చెల్లింపులు రూ.84.1 లక్షల కోట్లకు క్షీణించాయి. ఇంతక్రితం మార్చిలో ఈ విలువ రూ.156.5 లక్షల కోట్లుగా ఉంది. సంఖ్యా పరంగా ఏప్రిల్‌ నెలలో లావాదేవీలు 22 శాతం తగ్గి 238 కోట్లకు తగ్గాయి. ఏటీఎంల్లో డెబిట్‌ కార్డుల వినియోగం సైతం సగానికి పైగా పడిపోయిం ది. ఈ ఏప్రిల్‌లో డెబిట్‌ కార్డులను ఉపయోగించి 28.52 కోట్ల సార్లు నగదును ఉపసంహరించుకోగా.. మార్చిలో ఇవే కార్డుల ద్వారా 54.41 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఈ ఏప్రిల్‌ ముగింపు నాటికి దేశంలో మొత్తం 88.68 కోట్ల కార్డులున్నాయి. ఇందులో 82.94 కోట్ల డెబిట్‌ కార్డులు, 5.73 కోట్ల క్రిడెట్‌ కార్డులున్నాయి. దేశ వ్యాప్తంగా 2.34 లక్షల ఏటీఎం కేంద్రాలుండగా.. 50.85లక్షల పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) టర్మినల్స్‌న్నాయి. పీఓఎస్‌ మిషన్ల ద్వారా ఏప్రిల్‌లో రూ.111 కోట్లు ఉపసంహరించుకోగా.. మార్చిలో ఈ విలువ రూ.110 కోట్లుగా ఉంది.

Courtesy Nava Telangana