అక్టోబరు 3 నుంచి 400 జిల్లాల్లో నిర్వహణ

న్యూఢిల్లీ : రుణాలు కావలసిన వారికి వేగవంతంగా రుణాలందించడం కోసం ఎన్‌బీఎ్‌ఫసీలు, రిటైల్‌ కస్టమర్లతో బ్యాంకులు వచ్చే పండుగల సీజన్‌ లోగా 400 జిల్లాల్లో బహిరంగ సమావేశాలు నిర్వహిస్తాయని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఇళ్ల కొనుగోలుదారులు, వ్యవసాయదారులతో సహా అన్ని రకాల రుణాలు కావలసిన వారు ఈ సమావేశాల్లో పాల్గొంటారని ఆమె చెప్పారు. వచ్చే వారం నుంచి రెండు విడతలుగా ఈ సమావేశాలు జరుగుతాయని ఆమె పీఎ్‌సయూ బ్యాంకుల చీఫ్‌లతో సమావేశం అనంతరం చెప్పారు. అక్టోబరు 3-7 తేదీల మధ్యన 200 జిల్లాల్లోను, అక్టోబరు 11 నుంచి మరో 200 జిల్లాల్లోను ఈ సమావేశాలు జరుగుతాయని ఆమె అన్నారు. రానున్న పండుగల సీజన్‌లో గరిష్ఠ పరిమాణంలో రుణాలు బట్వాడా అయ్యేలా చూడడం ఈ సమావేశాల లక్ష్యమని ఆమె తెలిపారు. అక్టోబరులో వస్తున్న దీపావళి దేశంలో అతి పెద్ద షాపింగ్‌ సీజన్‌గా పరిగణిస్తారు. ఈ బహిరంగ సమావేశాల సందర్భంగా రిటైల్‌, వ్యవసాయ, ఎంఎ్‌సఎంఈ, హౌసింగ్‌ రుణాలందిస్తారని నిర్మల చెప్పారు.

 వచ్చే మార్చి వరకు ఎంఎ్‌సఎంఈలకు ఊరట ఒత్తిడిలో ఉన్నవిగా గుర్తించిన ఎంఎ్‌సఎంఈ రుణాలేవీ వచ్చే ఏడాది మార్చి 31 లోగా మొండి బకాయిలుగా (ఎన్‌పీఏ) ప్రకటించవద్దని బ్యాంకులను కోరినట్టు ఆర్థికమంత్రి తెలిపారు. ఈ లోగా అలాంటి రుణాలన్నింటినీ పునర్‌ వ్యవస్థీకరించాలని సూచించినట్టు ఆమె చెప్పారు. ఆర్‌బీఐ ఇందుకు సంబంధించి ఇప్పటికే ఒక సర్కులర్‌ జారీ చేసిందని చెబుతూ ఆ సర్కులర్‌ను కట్టుదిట్టంగా ఆచరించాలని, ఒత్తిడిలో ఉన్న ఏ ఒక్క ఎంఎ్‌సఎంఈ రుణాన్ని ఎన్‌పీఏగా ప్రకటించవద్దని చెప్పామన్నారు. దీని వల్ల ఎంఎ్‌సఎంఈలకు ఊరట లభిస్తుందని ఆమె అన్నారు. అలాగే తగినంత లిక్విడిటీ ఉన్న ఎన్‌బీఎ్‌ఫసీలను కూడా బ్యాంకులు గుర్తించాయని, వారి వద్ద అందుబాటులో ఉన్న నగదు రుణాల బట్వాడాకు ఉపయోగిస్తాయని ఆమె చెప్పారు

Courtesy Andhrajyothy…