– నాలుగేండ్ల చిన్నారిపై..

లక్నో : పంతొమ్మిదేండ్ల యువతిపై లైంగికదాడి ఘటన మరిచిపోకముందే ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. నాలుగేండ్ల బాలికపై ఆమె తరుపు బంధువే లైంగికదాడి చేశాడు. బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా అరవింద్‌ అనే వ్యక్తి తీసుకువెళ్లి లైంగిక దాడి చేశాడని బాలిక మామయ్య తెలిపారు. అనంతరం సాయంత్రం పూట బాలికను చూసిన తల్లిదండ్రులకు అనుమానం రావడంతో ఆమెను వైద్యులకు చూపించారు. ఆమెపై లైంగికదాడి జరిగినట్టు వైద్యులు నిర్థారించారు. దీంతో బాలిక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబర్‌లో హథ్రాస్‌లో బాలికపై ఉన్నత వర్గాలకు చెందిన యువకులు లైంగికదాడికి పాల్పడి ఘోరంగా హింసించారు. అనంతరం ఆమె మరణించడంతో దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. తాజా కేసులో నిందితుడ్ని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్టు పోలీస్‌ అధికారి రుచి గుప్తా వెల్లడించారు. హథ్రాస్‌లోని సాన్సి ప్రాంతంలో ఈ ఘటన మంగళవారం జరిగినట్టు చెప్పారు.

Courtesy Nava Telangana