ఎలక్ట్రిక్‌ బస్సుల్లో ఆర్టీసీ ఉద్యోగులకు నో ఛాన్స్‌
– 325 బస్సులకు రెండో వారంలో టెండర్లు
ఆరేండ్లలో నియామకాల్లేవు

గ్రేటర్‌లో ఎలక్ట్రికల్‌ బస్సుల సంఖ్యను పెంచే దిశగా ఆర్టీసీ అడుగు లు వేస్తోంది. వీటికోసం రెండో వారంలో టెండర్ల ప్రక్రియ ప్రారం భించాలని నిర్ణయించింది. దీంతో డిసెంబర్‌లో 325 ఎలక్ట్రిక్‌ బస్సు లు రోడ్డెక్కనున్నాయి. దీంతో ఉద్యోగ నియామకాలను చేపడతా రని నిరుద్యోగులంతా భావిస్తున్నారు. అయితే, ఈ అద్దె బస్సుల్లో ప్రయివేటు సిబ్బందినే నియమించుకోవడంతోపాటు సంస్థలో కొత్త నియామకాలు చేపట్టే అవకాశాల్లేవని ఆర్టీసీ చెప్పకనే చెప్పింది.

అప్పుడు ఏసీ.. ఇప్పుడు నాన్‌ఏసీ
మొదటి దశలో ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సులను కొనుగోలు చేసిన ఆర్టీసీ.. రెండో దశలో 325 నాన్‌ఏసీ బస్సులను తీసుకోవాలని నిర్ణయిం చింది. మార్చిలో గ్రేటర్‌లో టీఎస్‌ఆర్టీసీ ఓలెక్ట్రా గ్రీన్‌ లిమిటెడ్‌ సహ కారంతో 40 ఎలక్ట్రికల్‌ ఏసీ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. ఈ సంవత్సరం చివరి నాటికి మరో 325 ఎలక్ట్రికల్‌ బస్సులు నగరానికి వస్తాయని ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. రెండో విడతలో వచ్చే ఎలక్ట్రికల్‌ బస్సులు ఆర్డినరీ కావడంతో వాటిని నగర వ్యాప్తంగా అన్ని రూట్లలో నడుపుతామని గ్రేటర్‌ ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం గ్రేటర్‌లో ఉన్న 40 ఎలక్ట్రికల్‌ ఏసీ బస్సులను సికింద్రాబాద్‌, మియాపూర్‌ ప్రాంతాల నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ రూట్లలో నడుపుతున్నారు. ఎలక్ట్రికల్‌ బస్సుల్లో 39మంది ప్రయాణికులు ప్రయాణం చేసే వీలుంటుంది. వచ్చే ఎలక్ట్రికల్‌ బస్సులను 4 గంటలపాటు చార్జింగ్‌ పెడితే 300కిలోమీటర్లు తిరుగుతాయని అధికారులు చెబుతున్నారు. అయితే, ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సుల్లో చార్జీలు ఎక్కువగానే ఉన్నాయి.

ఖర్చు కాస్త తక్కువే..
గ్రేటర్‌లో ప్రస్తుతం 3వేలకుపైగా బస్సులను ఆర్టీసీ నడుపుతున్నది. ఇప్పుడు 40 ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సులుండగా, మరో 325నాన్‌ఏసీ బస్సులు రానున్నాయి. భవిష్యత్‌లో బస్సులను తగ్గిస్తూ ఎలక్ట్రికల్‌ బస్సులు పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. సాధారణ బస్సులు ఒక కిలోమీటర్‌ నడిపేందుకు డిజీల్‌కు రూ.18-22వరకు ఖర్చు అవుతోందని, ఎలక్ట్రికల్‌ బస్సులు కిలోమీటర్‌కు రూ.6-8 ఖర్చవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. గ్రేటర్‌లో పూర్తిస్థాయిలో ఎలక్ట్రికల్‌ బస్సులు అందుబాటులోకి తీసుకొస్తే డీజిల్‌ ఖర్చు భారీగా తగ్గే అవకాశాలుంటాయని భావిస్తున్నారు.

ప్రశ్నార్థకంగా నియామకాలు
తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఆర్టీసీలో నియామకాలే జరగలేదు. జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు మెరిట్‌ లిస్టు ప్రకటించినా ఇంతవరకు ప్రక్రియనే పూర్తికాలేదు. అయితే, ఆర్టీసీలో అద్దెల బస్సుల ప్రవేశంతో సంస్థ నియామకాలు చేపట్టకపోవడంతోపాటు ప్రయివేటు సిబ్బందినే నియమించుకోనుంది.
గ్రేటర్‌లో 2వేలకుపైగా ఉద్యోగాలను భర్తీచేయాలని, 3వేలకుపైగా బస్సులు కావాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా స్పందన రాలేదు. సర్కార్‌ నుంచి క్లియరెన్స్‌రాదు.. ఉద్యోగ నియామకాలు చేపట్టరని ఉద్యోగ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

(Courtacy Nava Telangana)