వ్యాధి నిరోధక టీకాలంటేనే పట్టని కొందరు తల్లిదండ్రుల వైఖరే మూలం
అధికారుల ఉదాసీనతా జతపడి నగరంలో దయనీయ స్థితిగతులు

రాజధానిలో వ్యాధులు ఎక్కువవుతున్నాయి. డెంగీతో పాటు ఇతర విషజ్వరాలు  ప్రబలుతున్నాయి. పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్లనే సమస్యలు ప్రస్తుతం మరింత జటిలంగా మారాయి. వైద్యశాలలను ఆశ్రయించేవారి సంఖ్య రోజురోజుకూ విస్తరిస్తోంది. శిశువులు పుట్టింది మొదలు వారికి పదేళ్లు వచ్చేవరకు వివిధ దశల్లో వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించాల్సి ఉంటుంది. ఇప్పటికీ 20 నుంచి 30శాతం మంది బాలబాలికలు టీకాలకు దూరంగానే ఉంటున్నారు. ఒకటి రెండేళ్ల వరకు కొన్ని డోసులు ఇప్పించిన తల్లిదండ్రులు..కారణాలేవైనా ఆ తర్వాత కొనసాగించడం లేదు. సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణం. కొంతమంది అధికారుల ధోరణీ స్థితిగతులను దయనీయంగా తయారుచేస్తోంది. డీపీటీ టీకాను అయిదో ఏటదాకా కొనసాగించకుంటే కంఠసర్పి తప్పదు. పలువురు పసివాళ్లు ఈ బాధతోనే ఫీవర్ ఆసుపత్రిలో చేరుతున్నారు. సకాలంలో టీకాలు పొందకపోవడం, పోషకాహార లోపం, వ్యాధులకు ఆస్కారమిస్తున్నాయి. వ్యాధి నిరోధక శక్తి అనేది శరీరానికి రక్షణ వ్యవస్థ వంటిది. ఎన్ని వ్యాధి కారక క్రిములు దాడి చేసినా, వాటిని అదే అడ్డుకుంటుంది. విటమిన్లు, ఇతర పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల- వ్యాధుల బారిన తొందరగా పడకుండా చూసుకోవచ్చు. అదే సమయంలో పిల్లల పరంగా ఇతర జాగ్రత్తలూ అవసరమని నగర వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇవి ఎంతైనా ముఖ్యం.. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అదే వైరస్ పై పోరాడి ఇన్ ఫెక్షన్లు రాకుండా చేస్తుంది. జింక్ సైతం బాగా ఉపయోగపడుతుంది. ఇందుకు గుడ్లు, మాంసం, పెరుగు, పాలు చేపలు దోహదపడతాయి. చాలామందికి పెరుగు వేసుకోవడం ఇష్టం. రోజూ ఒక కప్పు తీసుకోవడం వల్ల అది జీర్ణశక్తికి తోడ్పడుతుంది. క్యారెట్లో పుష్కలంగా ఎ విటమిన్ లభిస్తుంది. దాన్ని నిత్యం పిల్లలకు పెట్టడం మంచిది. వెల్లుల్లిలో ఉండే పోషక పదార్థాలు బ్యాక్టీరియా పై పోరాడేలా చేస్తాయి. బెల్లం, ఖర్జూరాల్లో ఉండే ఐరన్ ఎంతో ఆరోగ్యకరం. మిఠాయిలను ఇష్టపడే పిల్లలకు బెల్లంతో తయారుచేసినవి ఇవ్వడం ఉత్తమమని నగర వైద్యులు సూచిస్తున్నారు. వ్యాధి నిరోధకంగా ఉపకరించే పొటాషియం అధికంగా అరటి పండ్లలో ఉంటుందన్నారు. చిరు ధాన్యాలతో చేసిన ఆహారం కూడా సూక్ష్మపోషకాలుగా వినియోగపడుతుందని చెబుతున్నారు.

Courtesy Eenadu…