• ధరల నియంత్రణకు చర్యలు : పాసవాన్‌

ఇంట్లో దొంగలు పడితే డబ్బో.. బంగారమో దోచుకెళతారు! ఆ చోరశిఖామణులేమో ఉల్లిగడ్డల కోసం కన్నం వేశారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో రాహుల్‌ బజ్‌రావు అనే రైతు ఇంట్లో నుంచి రూ.లక్ష విలువైన ఉల్లిగడ్డలతో ఉడాయించారు. వచ్చే వేసవిలో అమ్ముకునేందుకు 117 ప్లాస్టిక్‌ క్రేట్లలో 25 టన్నుల ఉల్లిగడ్డలను నిల్వ చేశానని, స్టాకంతా దోచుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉల్లి ధరలు బెంబేలెత్తిస్తుండడంతో నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారించింది. వినియోగదారులు, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకుంటున్నట్లు ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ చెప్పారు. ప్రభుత్వం వద్ద ఉన్న 50వేల టన్నుల నిల్వల్లో 15వేల టన్నులను మార్కెట్‌లోకి విడుదల చేశామన్నారు.

Courtesy AndhraJyothy..

 

Tags-India, 25, tonnes ,of, Onion, theft ,from, Maharashtra, Farmers, house, price, skyrocketed