• చావలేక బతుకుతున్న బాధితులు
  • కడప జిల్లాలో ఊళ్లు ఖాళీ అవుతున్న వైనం

అక్కడ మృత్యురక్కసి కోరలు చాచింది. పల్లెలపై విరుచుకుపడుతోంది. అకాల మృత్యువు ఎక్కడ కబళిస్తుందోనన్న భయంతో స్థానికులు ఊళ్లను ఖాళీ చేస్తున్నారు. ఇవి కడప జిల్లా వేముల మండలం యురేనియం పరిశ్రమ శివారు గ్రామాల్లోని దృశ్యాలు. యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (యుసిఐఎల్‌)కు ఏర్పాటు చేసిన శుద్ధి కర్మాగారం వల్ల భూగర్భజలాలు కలుషితం అవుతున్నాయని వచ్చిన ఫిర్యాదులపై కాలుష్య నియంత్రణ మండలి విజయ వాడలో నేడు విచారణ నిర్వహించనుందని సమా చారం. ఇంత దూరంలో జరిగే విచారణ ప్రక్రియకు హాజరయ్యే వారేందరో…కాలేని వారెందరో చూడాలి..<br ‘times=”” new=”” roman’;=”” font-size:=”” medium;\”=””><span ‘times=”” new=”” roman’;=”” font-size:=”” medium;\”=””>కడప జిల్లా వేముల మండలం ఎం.తుమ్మలపల్లె వద్ద 2007లో నిర్మాణమైన యురేనియం శుద్ధి కర్మాగారం, ఉత్పత్తి మొదలైన కొన్నాళ్ల నుండే భూగర్బ జలాలపై దీని ప్రభావం కనిపించింది. భూగర్భ జలమట్టం 150 అడుగుల నుండి 700-1000 అడుగులకు పడిపోయింది. నీళ్లు కూడా విషతుల్యంగా మారాయి. పచ్చని తోటలను కాపాడుకునేందుకు రైతులు లెక్కలేనన్ని బోర్లను వేశారు. నవ్వలు, దద్దుర్లు, చర్మవ్యాధులు ప్రతి ఇంటా తిష్టవేశాయి. నీళ్లు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. హెలీపాడ్‌ సమీపంలో ఉన్న మహేశ్వర్‌రెడ్డి (మబ్బుచింతలపల్లి)కి చెందిన ఆరు ఎకరాల తోట యురేనియం కాలుష్యం వల్ల దెబ్బతింది. ఆరు లక్షల రూపాయలు అప్పు మిగిలింది. కాలుష్యం ఆ కుటుంబాన్ని నిట్టనిలువునా నాశనం చేసింది. ఉత్పత్తి ప్రక్రియలో ఏమాత్రం ప్రమాణాలు పాటించక పోవడమే దీనికి కారణం. ఈ ప్రాంతంలో పరిశోధన చేసిన శాస్త్రవేత్త బాబూరావు వ్యర్థాలను విడుదల చేస్తున్న (టైలింగ్‌ పాండ్‌) చెరువుకు లైనింగ్‌ వేయనందున నీరు విషతుల్యమైందని తేల్చారు. అప్పట్లో ఆ శాస్త్రవేత్తపై యురేనియం సంస్థ కేసులు పెట్టి అరెస్టు చేయించింది. ‘మీవి సున్నపు భూములు. మా తప్పేమీ లేదు. మేం అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాం’ అని యురేనియం పరిశ్రమ బుకాయించింది. ప్రమాదమని తెలుసుకున్న రైతులు కడప ఎంపి అవినాష్‌రెడ్డికి తమ గోడు విన్నవించుకోగా ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కాలుష్య నియంత్రణ మండలి పరీక్షలను నిర్వహించింది. ఆ పరీక్షల్లో నీరు విషతుల్యంగా మారాయని, భూములన్నీ నిస్సారంగా మారాయని తేలాయి. ఆ తరువాత కాలుష్య నియంత్రణ మండలి యురేనియం సంస్థకు షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. ఎం.తుమ్మలపల్లె ప్రాంతంలో పలు బోర్లలో, బావుల్లో యురేనియం గాఢత నిర్ణీత పరిమితి కంటే అనేక రెట్లు ఎక్కువగా చేరిందని పేర్కొంది. జల కాలుష్య నియంత్రణ, నిరోధక చట్టం కింద ఎందుకు చట్టబద్దమైన చర్యలు తీసుకోకూడదో చెప్పాలని ఆగస్టు ఏడో తేదీన యురేనియం సంస్థకు షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. ఇప్పుడు న్యాయ విచారణ నిర్వహిస్తోంది. తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో రైతులు భూములిచ్చారు. యుసిఐఎల్‌ వారి భూములను ఆక్రమించినా ఒకే ఒక్కరు తప్ప కోర్టుకు ఎవరూ వెళ్లలేదు. ఎప్పుడో ఒకప్పుడు ఉద్యోగాలు రాకపోతాయా అనే చిన్న ఆశ. కరువు జిల్లాలో ఉద్యోగాలపై ఉన్న మోజుతో ఎవరూ నోరు మెదపలేదు. ఉద్యోగాలివ్వకపోగా ముడి ఖనిజం తవ్వకం, యురేనియం ఉత్పత్తి ప్రక్రియలో వెలువడే వ్యర్థాల నిర్వహణలో యురేనియం సంస్థ ప్రమాణాలు పాటించలేదు.

(COURTECY PRAJA SHAKTHI)