బిజేపీ రగిలించిన కుంపటి                   
( సిద్ధార్థ భాటియా)

మేనక గాంధీ కాషాయ పార్టీ లోనికి అవసరార్థం ప్రవేశించారు. ఆమె ఆర్ఎస్ఎస్లో పుట్టి పెరగలేదు. 1989 నుంచి జనతాదళ్ లేదా స్వతంత్ర అభ్యర్థిగా ఆమె లోక్ సభకు ఎన్నికయ్యారు. 2004లోబిజేపీలో చేరారు.2009లో మేనకా కుమారుడు వరుణ్ గాంధీ ఫిలిబిట్ నుంచి పోటీ చేసి నెగ్గారు.బిజేపీపై తన అభిమానాన్ని ప్రదర్శించుకునేందుకు వారిద్దరూ ఎన్నికలప్పుడు హడావుడి చేస్తుంటారు.సంఘ్ పరివార్ సిద్ధాంతానికి అనుగుణంగా ముస్లింలపై దుర్భాషలు హెచ్చరికలు చేస్తుంటారు.

తనకు ఓటేయ్యని ముస్లింలకు తాను పనులేమి చేసిపెట్టనని మేనకా హెచ్చరించటం ఈ కోవలోనిదే. ఉన్నావ్ లో సాక్షి మహారాజు కూడా ఇలాంటి మాటలు అన్నారు. గతంలో మతవిద్వేష ఉపన్యాసాలు ఇచ్చే నరేంద్ర మోడీ 2014 ఎన్నికలప్పుడు అవినీతి, ప్రజల జీవన సమస్యలు, ఉద్యోగాలు, ఆర్థికాభివృద్ధి వంటి అంశాలపై అభిభాశించారు. యూపీఏకి ప్రత్యామ్నాయం కోరుకుంటున్న ప్రజల కోసమే ఈ విధంగా ఆయన తన ఉపన్యాససరళిని మార్చారు.

2019 ఎన్నికలు వచ్చాయి.ఆర్థిక రంగంలో ప్రగతి చూపించలేని మోడీ ఆయన సహచరులు ఇప్పుడు మళ్ళీ తమ మూలాలు లోకి వచ్చారు. ఓటర్లు ముఖ్యంగా హిందూ ఓటర్లకు ముస్లింలను శత్రువులుగా, భూచిగా చూపించడం మొదలు పెట్టారు. జాతి ద్రోహుల పట్ల కఠినంగా ఉండేలా రాజద్రోహ చట్టాన్ని పటిష్ట పరుస్తామని రాజ్నాథ్ సింగ్ అంటున్నారు. కఠినమైన ప్రశ్నలు, సర్కారు వారి విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తే ఊరుకునేది లేదంటున్నారు. భారత్ లోకి చొచ్చుకు వచ్చిన ప్రతి హిందువేతర వ్యక్తిని వెల్లగోడుతామని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా హెచ్చరిస్తున్నాడు.

2019 లోక్సభ ఎన్నికల ప్రచారంశాలుగా బిజేపీ పుల్వామా, బాలకోట్, హైపర్ జాతీయ వాదాన్ని చేపట్టింది. ఇవి అంతగా జనానికి ఎక్కటం లేదని గ్రహించి ఆ పార్టీ నేడు గేరు మార్చింది. తమ పాత నినాదాన్ని మళ్ళీ తిరిగి  ఎత్తుకుంది. కమ్యూనిస్టులు, యూదులకు వ్యతిరేకంగా హిట్లర్ ద్వేషాన్ని నూరిపోశాడు. ఇప్పుడు భారతీయ జనతాపార్టీ చేస్తున్నది ఇలాంటిదే. దీన్ని గట్టిగా తిప్పికొట్టే వారు లేకపోవడం విచారకరం. ఎన్నికలు గడిచిపోతాయి. కానీ బిజెపి రగిలించిన కుంపటి చాలా కాలం దాకా రగులుతూనే ఉంటుంది.

రచయిత సీనియర్ జర్నలిస్టు
(ద వైర్ సౌజన్యంతో)