చెల్లిని పెళ్లిచేసుకున్నాడని దళితుణ్ని నడిరోడ్డుపై..

సమాజంలో ఎన్ని మార్పులు వచ్చినా.. కుల హత్యలు, దాడులు మాత్రం ఆగడం లేదు. ఇలా కొన్ని‌చోట్ల దళితులపై వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. దళితుల పెళ్లి ఊరేగింపులు తమ వీధుల నుంచి వెళ్లరాదంటూ దాడులు జరుగుతునే ఉన్నాయి. తాజాగా ఓ దళిత పోలీస్ పెళ్లి ఊరేగింపుపై అగ్రవర్ణాలు దాడికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాజస్తాన్‌లోని దుగార్ గ్రామంలో చోటు చేసుకుంది.

శనివారం ఓ దళిత పోలీసు పెళ్లి ఘనంగా జరిగింది. అనంతరం పెళ్లి ఊరేగింపు జరుగుతోంది. ఆ సమయంలో కొందరు రాజ్‌పుట్ వర్గీయులు ఊరేగింపులో చేరి, వారిపై దాడి చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై ఆయుధాలతో దాడికి పాల్పడ్డారు. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వరుడు సవాయి రామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

 

Leave a Reply