గ్లౌజ్ ధరించి దళితులకు షేక్ హ్యాండిచ్చిన లోక్‌సభ అభ్యర్థి

పశ్చిమ బెంగాల్ నటి, తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మీమీ చక్రవర్తి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. బెంగాల్‌లోని జాదవ్‌పూర్ లోక్‌సభ స్థానం బరిలో ఉన్నారు. ఆమె గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేతికి గ్లౌజ్ తొడుక్కొని ప్రజలకు షేక్ హ్యాండిచ్చారు. అప్పుడు తీసిన ఫోటోలను నెటిజన్లు సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేయడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి. ఆమె చేసిన నిర్వాకంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

ఈ విషయమై బీజేపీ నాయకుడు మేజర్ సురేంద్ర పునియా ఆమె ఫోటోను ట్వీట్ చేస్తూ…’చాలా విచారకరం.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ జాదవ్‌పూర్ లోక్‌సభ అభ్యర్థి మీమీ చక్రవర్తి చేతులకు గ్లౌజ్ తొడుక్కొని పేద ప్రజలకు, దళితులకు షేక్ హ్యాండిస్తున్నారు. క్వీన్ ఎలిజబెత్ వాళ్ళు అంటరానివాళ్ళా? భారతీయ ప్రజాస్వామ్యం ఇలాంటి వారిని పార్లమెంట్‌లో సహించదని’.. రాసుకొచ్చారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆమెపై విమర్శలు గుప్పిస్తోంది.


Leave a Reply