• సాధారణ పరిపాలన శాఖకు చివరి నుంచి రెండో స్థానం
 • ఆయన మిగతా శాఖలకు 8, 11, 12, 18 ర్యాంకులు
 • 20శాఖల పనితీరుపై సీఎ్‌సకు నివేదిక
 • పరిశుభ్ర పరిసరాల్లో దసరా జరగాలి
 • ఇందుకు ప్రజా భాగస్వామ్యమే కీలకం
 • సర్కారుకు తోడుగా నిలవడం మీవంతే
 • కలెక్టర్లకు సాయంగా ప్రత్యేక అధికార్లు
 • ఎంపీడీవోల వాహన అలవెన్స్‌
 • రూ.24 వేల నుంచి 33 వేలకు పెంపు
 • ఊర్లలో అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ
 • సంఖ్య కాదు.. మొక్కల రక్షణే ముఖ్యం
 • పని చేస్తే ప్రోత్సాహం.. లేకుంటే చర్య
ముఖ్యమంత్రి పర్యవేక్షించే శాఖల పనితీరు మెరుగ్గా ఉంటుందనేది ఓ భావన. మిగతా మంత్రులు నిర్వహిస్తున్న శాఖలకు సీఎం నిర్వహిస్తున్న శాఖల పనితీరే ఆదర్శంగా నిలుస్తుందని అనుకుంటారు. అయితే, సీఎం కేసీఆర్‌ నిర్వహిస్తున్న శాఖలు మాత్రం పనితీరులో వెనుక వరుసలో నిలిచాయి. సీఎం పర్యవేక్షణలో ఉన్న సాగునీటిపారుదల, సాధారణ పరిపాలన, విద్యుత్తు, రెవెన్యూ, ఐటీ, పురపాలక-పట్టణాభివృద్ధి వంటి కీలక శాఖలు సేవల్లో పేలవంగా ఉన్నట్లు తేలింది. సాధారణ పరిపాలన శాఖ అయితే చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. శాఖల పనితీరుపై సీఎస్‌ ఎస్‌కే జోషి కోరి తెప్పించుకున్న నివేదికలో తేలిన అంశాలివి! ఆయా శాఖల పనితీరుపై వివరాలను పంపాలంటూ ఆగస్టు 28న అన్నిశాఖల కార్యదర్శలుకు జోషి అంతర్గత ఉత్వర్వులను జారీ చేశారు. ముఖ్యంగా గత ఏడాది అన్ని శాఖల పనితీరు, ఈ ఏడాది వార్షిక ప్రణాళికపై వివరాలు కోరారు. ఆయా శాఖలు అనుసరిస్తున్న నాణ్యతా ప్రమాణాలు, ప్రజలకు అందిస్తున్న సేవలు, ఆయా శాఖలకు ఉపయోగపడుతున్న అంశాలు, వివిధ భాగస్వామ్య విభాగాలకు ప్రయోజనం వంటి అంశాలపై వివరాలు పంపించాలని కోరారు. మొత్తం 34 శాఖల నుంచి వివరాలు కోరగా… 20 శాఖల నుంచి వివరాలు అందాయి ఆర్థిక శాఖ నుంచి ఎలాంటి వివరాలు అందలేదు. ఆరుగురు సీనియర్‌ ఐఏఎ్‌సలు ఈ వివరాలను పరిశీలించి ర్యాంకులు ఇచ్చారు. దీని ప్రకారం తొలి 3స్థానాల్లో వరుసగా మహిళా సంక్షేమం, కార్మిక, వ్యవసాయ శాఖలు నిలిచాయి. కేసీఆర్‌ వద్ద ఉన్న సాధారణ పరిపాలన శాఖకు 19వ ర్యాంకు, ఐటీ శాఖకు 18, పరిశ్రమల శాఖకు 15, రెవెన్యూ శాఖకు 12, విద్యుత్తు శాఖకు 11, సాగునీటి పారుదల శాఖకు 8, పురపాలక-పట్టణాభివృద్ధి శాఖకు 6వ ర్యాంకు దక్కాయి. ఇదివరకు కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహించిన పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల పనితీరు కూడా పేలవంగా ఉన్నట్లు తేలింది.

శాఖల ర్యాంకులు

మహిళా శిశు సంక్షేమం 1
కార్మిక 2
వ్యవసాయం 3
వైద్య ఆరోగ్యం 4
పశు సంవర్థక 5
పురపాలక, పట్టణాభివృద్ధి 6
అడవులు 7
సాగునీటి పారుదల 8
యువజన సర్వీసులు 9
పౌర సరఫరాలు 10
విద్యుత్తు 11
రెవెన్యూ 12
హోం 13
పరిశ్రమలు 14
గృహ నిర్మాణం 15
ఎస్సీల అభివృద్ధి 16
పంచాయతీరాజ్‌ 17
ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ 18
సాధారణ పరిపాలన 19
వెనుకబడిన తరగతులు 20